Manish Sisodia Petition : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్

మనీశ్ సిసోడియా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. తనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై కోర్టులో విచారణ జరిగింది.

Manish Sisodia Petition : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు.. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్

Manish Sisodia

Manish Sisodia Petition : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో మనీశ్ సిసోడియాతోపాటు పలువురిని అరెస్టు చేసి, విచారిస్తున్నారు. మనీశ్ సిసోడియాను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. ఈ నేపథ్యంలో మనీశ్ సిసోడియా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. తనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ పై కోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణ ఏప్రిల్ 5కు వాయిదా వేసింది.

సిసోడియా బెయిల్ పిటిషన్ పై ఈడీ స్పందన తమకు అందలేదని సిసోడియా తరపు న్యాయవాదులు తెలిపారు. బెయిల్ పిటిషన్ పై ఈడీ స్పందన తాము తెలుసుకోవాలనుకుంటున్నట్లు సిసోడియా తరపు న్యాయవాది ధ్యాన్ కృష్ణన్ కోర్టుకి తెలిపారు. ఇందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 5 మద్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది.

Manish Sisodia ED Custody : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియా కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం మనీ లాండరింగ్ కేసులో మార్చి9న మనీశ్ సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో అక్రమాలు, మద్యం తయారీ కంపెనీలు, వ్యాపారులకు అనుకూలంగా నిర్ణయాలు, ముడుపుల వ్యవహారంపై సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది. 12 రోజుల పాటు కస్టడీలో మనీశ్ సిసోడియాను ఈడీ ప్రశ్నించింది. ప్రస్తుతం సిసోడియా తిహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మద్యం కుంభకోణంలో సిసోడియా కీలక పాత్ర పోషించారని సీబీఐ, ఈడీ ఆరోపిస్తున్నారు.

ఈ కేసులో సిసోడియాను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో సిసోడియా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ తప్పుడు ఆరోపణలు చేస్తుందని, ఎటువంటి నగదు తన వద్ద దొరకలేదని, కేసు దర్యాప్తుకు సహకరిస్తున్నందున, ప్రజాప్రతినిగా ఉన్నందున, కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉన్నందున సిసోడియా బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. తనకు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ లో కోరారు.