Delhi : నడిరోడ్డుపై వ్యక్తిని చితకబాదారు…వీడియో వైరల్

దేశ రాజధానిలో ఓ వ్యక్తిపై పిడిగుద్దులు కురిపించాడో ఓ వ్యక్తి. మరో వ్యక్తి కర్రతో దాడి చేయగా..మహిళ అడ్డుకొంది. నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనను కొంతమంది సెల్ ఫోన్ లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

Delhi : నడిరోడ్డుపై వ్యక్తిని చితకబాదారు…వీడియో వైరల్

Delhi

Delhi Man Hit : దేశ రాజధానిలో ఓ వ్యక్తిపై పిడిగుద్దులు కురిపించాడో ఓ వ్యక్తి. మరో వ్యక్తి కర్రతో దాడి చేయగా..మహిళ అడ్డుకొంది. నడిరోడ్డుపై జరిగిన ఈ ఘటనను కొంతమంది సెల్ ఫోన్ లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. బైక్ ను ఢీకొట్టాడనే కారణంతో దాడి చేశారని వీడియోను బట్టి తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.

చేతిలో హెల్మెట్ పట్టుకుని ఉన్న వ్యక్తిపై మరోక వ్యక్తి ముష్టిఘాతాలు కురిపించాడు. మరొక వ్యక్తిని ఇంకొకరు పట్టుకున్నాడు. ఎవరు చెప్పినా అతడిపై పంచుల వర్షం కురిపించాడు. వాహనదారుడి స్నేహితుడిని కూడా చితకబాదారు. ఈ సమయంలో మరొక వ్యక్తి కర్రతో వచ్చి..దాడి చేసేందుకు ప్రయత్నించగా..మహిళ వారించింది. అయినా..అతను కొట్టడానికి యత్నించడం వీడియోలో కనిపిస్తోంది.

ఆ తర్వాత వారిద్దరినీ వదిలేసి వెళ్లిపోయారు. దాడిలో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఆలస్యంగా వెలుగు చూడడంతో పోలీసులు రంగంలోకి దిగినట్లు సమాచారం. స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.