Policemen Grabbed Gold : ఎయిర్ పోర్టులో ప్రయాణికులను బెదిరించి.. భారీగా బంగారం లాక్కున్న ఇద్దరు పోలీసులు

ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమాన ప్రయాణికులను బెదిరించి బంగారం లాక్కున్న ఇద్దరు పోలీసులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఎయిర్ పోర్టు టెర్నినల్-3 వద్ద ప్రయాణికులను బెదరించిన ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ వారి దగ్గర నుంచి సుమారు 50 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Policemen Grabbed Gold : ఎయిర్ పోర్టులో ప్రయాణికులను బెదిరించి.. భారీగా బంగారం లాక్కున్న ఇద్దరు పోలీసులు

AIRPORT

Policemen Grabbed Gold : ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమాన ప్రయాణికులను బెదిరించి బంగారం లాక్కున్న ఇద్దరు పోలీసులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఎయిర్ పోర్టు టెర్నినల్-3 వద్ద ప్రయాణికులను బెదరించిన ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ వారి దగ్గర నుంచి సుమారు 50 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాబిన్ సింగ్, గౌరవ్ కుమార్ అనే ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ టెర్నినల్-3 వద్ద సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఈ నేపథ్యంలో దుబాయ్ నుంచి వచ్చే ప్రయాణికులను వారు టార్గెట్ చేశారు. ప్రయాణికుల వద్ద నుంచి బంగారు ఆభరణాలను ఆ పోలీసులు బెదిరించి తీసుకున్నారు.  అయితే ఆ ఇద్దరు పోలీసుల నుంచి సుమారు 51 లక్షల విలువైన బంగారాన్ని ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Police Constable : పోలీసు ఉద్యోగానికి ఎంపికైన యువతి-బంగారం చోరీ కేసులో అరెస్ట్

సలావుద్దీన్ కతా అనే వ్యక్తి నుంచి సుమారు 600 గ్రాముల బంగారం, షేక్ ఖాదర్ బాషి నుంచి 400 గ్రాముల బంగారాన్ని సదరు పోలీసులు లాక్కున్నట్లు ఫిర్యాదులో తేలింది. దీంతో బెదిరింపులకు పాల్పడిన పోలీసులను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.