Car Accident : యాక్సిడెంట్‌లో తుక్కు తుక్కైన 10 కోట్ల కారు.. ఇంతకీ ఎవరిదా ఖరీదైన కారు?
హర్యానాలోని నూహ్‌లో న్యూఢిల్లీ-ముంబయి ఎక్స్ ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన రోల్స్ రాయిస్ కారు ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టి తుక్కు తుక్కైంది. ట్రక్కులో ప్రయాణిస్తున్న డ్రైవర్, అసిస్టెంట్ స్పాట్‌లో చనిపోయారు. రోల్స్ రాయిస్ ఖరీదు రూ.10 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Haryana
Car Accident Haryana : రూ.10 కోట్లకు పైన ఖరీదు చేసే లగ్జరీ కారు రోల్స్ రాయిస్ (Rolls Royce Crash) అతి వేగంగా వచ్చి పెట్రోలు ట్యాంకర్‌ను ఢీ కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో రోల్స్ రాయిస్ తుక్కు తుక్కైంది. ట్యాంకర్‌లో ప్రయాణిస్తున్న డ్రైవర్, అసిస్టెంట్ స్పాట్‌లో చనిపోయారు. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు ప్రముఖ పారిశ్రామిక వేత్త, కుబేర్ గ్రూప్ డైరెక్టర్ వికాస్ మాలుగా (Vikas Malu) పోలీసులు ధృవీకరించారు.
Madhurai Train Fire Accident : మధురై రైలు బోగీల్లో ఘోర అగ్నిప్రమాదం, 9 మంది మృతి
మంగళవారం హర్యానాలోని నూహ్‌లో న్యూఢిల్లీ-ముంబయి ఎక్స్ ప్రెస్ హైవేపై లగ్జరీ కారు రోల్స్ రాయిస్ పెట్రోలు ట్యాంకర్‌ను ఢీకొన్న ఘటనలో ట్యాంకర్ లో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు మరణించారు. రోల్స్ రాయిస్‌లో ప్రయాణిస్తున్న వికాస్ మాలు తీవ్రగాయాలతో గురుగ్రామ్ మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు స్పష్టం చేశారు. ఆయనతో పాటు కారులో ఉన్న మరో ఇద్దరికి చికిత్స అందుతోంది. వికాస్ మాలు ప్రస్తుత పరిస్థితిపై వైద్యులు ధృవీకరించాల్సి ఉంది.
ట్యాంకర్ యు టర్న్ తీసుకుంటుండగా రోల్స్ రాయిస్ వేగంగా వచ్చి ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిందని డ్రైవర్, అసిస్టెంట్ పక్కనే కూర్చున్న గౌతమ్ అనే వ్యక్తి పోలీసులకు చెప్పాడు. ప్రస్తుతం అతను హర్యానాలోని ఉజినాలో తీవ్ర గాయాలకు చికిత్స పొందుతున్నాడు. రోల్స్ రాయిస్ గంటకు 190 కి వేగంతో ట్యాంకర్‌ను ఢీకొట్టి బోల్తా పడినట్లు గౌతమ్ తెలిపాడు. .
Road Accident : కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. జీపు లోయలో పడి 8 మంది కూలీలు దుర్మరణం
ప్రమాదంలో ధ్వంసమైన రోల్స్ రాయిస్ కారు ధర రూ.10 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో ఉంటుందని తెలుస్తోంది. ప్రమాదం జరిగినపుడు కారు ముందుభాగం ధ్వంసమై ఇంజన్ కాలిపోయి తలుపులు తెరిచి ఉన్నాయి. ట్యాంకర్ పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంది. మంటలు చుట్టుమట్టిన తరువాత ట్రక్కు కేవలం మెటల్ కుప్ప మాత్రం మిగిలింది. దీనిని బట్టి ప్రమాదం ఏ స్ధాయిలో జరిగిందో ఊహించవచ్చును. నాగినా పోలీస్ స్టేషన్‌లో ఎప్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నారు.