ఢిల్లీలో తెరుచుకున్నస్కూల్స్ : మాస్కులు ధరించి వెళ్తున్న విద్యార్థులు

  • Edited By: veegamteam , November 6, 2019 / 05:28 AM IST
ఢిల్లీలో తెరుచుకున్నస్కూల్స్ : మాస్కులు ధరించి వెళ్తున్న విద్యార్థులు
ad

ఢిల్లీలో పెరిగిన కాలుష్యం..దీనికి తోడు దీపావళి పండుగ సందర్భంగా పెరిగిన కాలుష్య ప్రభావంతో ప్రభుత్వం స్కూల్స్ కు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రకటించిన సెలవులు తరువాత తిరిగి ఈరోజు (నవంబర్ 6)న తెరుచుకున్నాయి. మాస్కులు ధరించి విద్యార్దులంతా స్కూళ్లకు వెళుతున్నారు. 

మంగళవారం (నవంబర్ 5)న ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 413 పాయింట్స్ బుధవారం నాటికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్  279 పాయింట్లుగా  నమోదైంది. ఢిల్లీలోని  మిగితా ప్రాంతాల్లోనూ  సివియర్  నుంచి పూర్ స్టేజీకి   AQI తీవ్రత  చేరింది. ఈ క్రమంలో  కాలుష్యం  ప్రభావంతో  మూతపడిన  స్కూళ్లు  ఇవాళ తెరుచుకున్నాయి.   విద్యార్థులు  మాస్కులు ధరించి స్కూళ్లకు  హాజరవుతున్నారు.
కాగా కాలుష్య ప్రభావం స్వల్పంగా తగ్గినా పొగమంచు మాత్రం ఢిల్లీ వాసులను ఇబ్బంది పెడతోంది. ఢిల్లీ శివారు ప్రాంతాలైన  గ్రేటర్ నోయిడా, గజియాబాద్ లోనూ  దట్టమైన పొగ కప్పేసింది. దీంతో  వాహనదారులు  తీవ్ర ఇబ్బందులు  పడుతున్నారు.