హస్తినలో ఉత్తరాంధ్ర రచ్చ : కొణతాల ఆందోళన

10TV Telugu News

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆధ్వర్యంలో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం ఆందోళన చేపట్టారు.  మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ నేతృత్వంలో ఢిల్లీ వెళ్లిన ఉత్తరాంధ్ర వాసులు నల్ల దుస్తులతో ఏపీ భవన్ అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసనకు దిగారు. ఉత్తరాంధ్ర, రాయలసీమకు ఆర్ధిక ప్యాకేజీ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు.  ఉత్తరాంధ్ర చర్చావేదిక నేతలు ఇవాళ ఉపరాష్ట్రపతిని కలవనున్నారు.  రాష్ర్ట విభజన సమయంలో కీలక పాత్ర పోషించిన ఉప రాష్ర్టపతి వెంకయ్యనాయుడు ఈ విషయంలో చొరవతీసుకోవాలని కొణతాల రామకృష్ణ డిమాండ్ చేశారు.