బడ్జెట్ 2020-21 బిగ్ అనౌన్స్ మెంట్..బ్యాంకు డిపాజిట్లు బీమా పెంపు

  • Published By: madhu ,Published On : February 1, 2020 / 07:51 AM IST
బడ్జెట్ 2020-21 బిగ్ అనౌన్స్ మెంట్..బ్యాంకు డిపాజిట్లు బీమా పెంపు

బ్యాంకు డిపాజిట్లపై ఉన్న బీమాను పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇప్పటి వరకు ఉన్న రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. పార్లమెంట్‌లో ఫిబ్రవరి 01వ తేదీ శనివారం ఉదయం 11గంటలకు బడ్జెట్ 2020-21ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగాపలు రంగాలకు కేటాయింపులు జరిపారు. 

బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అంటే ముందు..బ్యాంకు డిపాజిట్లపై బీమాను రెట్టింపు చేసే ప్రతిపాదనను కేంద్రం యోచిస్తోందని వివిధ నివేదికలు వెల్లడించాయి. గత సంవత్సరం PMC బ్యాంకును మూసివేయడంపై ప్రభుత్వం..ఆర్బీఐపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ప్రజలు తమ సొంత డబ్బులను కూడా తీసుకోకుండా..నిస్సహాయతతో మిగలిపోయారు.

మొత్తం డిపాజిట్ ఖాతాల్లో రూ. లక్ష లోపు 61 శాతం, రూ. 2 లక్షల లోపు 70 శాతం, రూ. 15 లక్షల లోపు 98.2 శాతం ఉన్నాయని ఎస్‌బీఐ అంచనా వేస్తోంది. పన్ను చెల్లింపు దారులను కాపాడుతామని, పన్నులు చెల్లింపు చేసే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూస్తామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో మరిన్న ఉద్యోగాలు కల్పిస్తామని, అలాగే..పన్ను ఎగవేత దారులపై మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

Read More : బడ్జెట్ 20-21 : ఎస్సీలకు 9 వేల 500 కోట్లు, ఎస్టీలకు రూ. 53 వేల 700 కోట్లు