DK Shivakumar: ఎన్డీఏలో చేరిన జేడీఎస్‌కు డీకే శివకుమార్ ఏం చెప్పారో తెలుసా?

కర్ణాటక మేకెదాటు ప్రాజెక్టుపై కూడా డీకే శివకుమార్ మళ్లీ స్పందించారు.

DK Shivakumar: ఎన్డీఏలో చేరిన జేడీఎస్‌కు డీకే శివకుమార్ ఏం చెప్పారో తెలుసా?

DK Shivakumar

DK Shivakumar – JDS: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections 2024) నేపథ్యంలో కర్ణాటకలో బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న జేడీఎస్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నట్లు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. మాజీ ప్రధాని, జేడీఎస్ (JDS) చీఫ్ హెచ్‌డీ దేవెగౌడ(Deve Gowda ), ఆయన కుమారుడు కుమారస్వామి (Kumaraswamy) ఢిల్లీలో పర్యటించి కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన విషయం తెలిసిందే.

ఎన్‌డీఏలో జేడీఎస్ చేరడం ఖరారైంది. ఈ నేపథ్యంలోనే డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ జేడీఎస్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నట్లు వ్యాఖ్యానించారు. వచ్చే లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలతో ఇండియా కూటమిని ఏర్పాటు చేసింది. దీంతో ఎన్డీఏ బలాన్ని మరింత పెంచుకోవడానికి బీజేపీ అగ్రనేతలు ప్రయత్నాలు జరుపుతున్నారు.

మేకెదాటు ప్రాజెక్టుపై..

మరోవైపు, కర్ణాటక మేకెదాటు ప్రాజెక్టు (Mekedatu project)పై డీకే శివకుమార్ మళ్లీ స్పందించారు. కావేరీ నది ప్రవహించే మేకెదాటు వద్ద రిజర్వాయర్ నిర్మిస్తామని కొన్ని వారాల క్రితం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలతో తమిళనాడు మండిపడింది. తాజాగా మరోసారి దీనిపై శివకుమార్ స్పందిస్తూ.. కావేరీ సమస్య గురించి సమాచారం తీసుకున్నామని అన్నారు.

తాము దాదాపు 3.5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని అన్నారు. ఈ నెల 26 వరకు ఇదే విధానం కొనసాగుతుందని, ఆ తర్వాత మరో ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. అలాగే, మేకెదాటు ప్రాజెక్టుపై తమ ప్రయత్నాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. తప్పనిసరిగా తీసుకోవాల్సిన అనుమతుల కోసం ప్రయత్నాలు జరుపుతామని అన్నారు.

Motkupalli Narasimhulu : జగన్ ది రౌడీ రాజకీయం.. చంద్రబాబు అరెస్ట్ ప్రజాస్వామ్యానికే ముప్పు.. కేసీఆర్ ఖండించాలి..