Missile Akash-NG : న్యూ జెనరేషన్ Akash-NG క్షిపణి పరీక్ష సక్సెస్

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) న్యూ జెనరేషన్ ఆకాష్ క్షిపణి (Akash-NG)ని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుంచి ఈ క్షిపణిని ప్రయోగించింది.

Missile Akash-NG : న్యూ జెనరేషన్ Akash-NG క్షిపణి పరీక్ష సక్సెస్

Drdo Successfully Flight Tests Surface To Air Missile Akash Ng

Surface-to-Air Missile Akash-NG : భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) న్యూ జెనరేషన్ ఆకాష్ క్షిపణి (Akash-NG)ని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుంచి ఈ క్షిపణిని ప్రయోగించింది. ఉపరితలం నుంచి గాల్లోకి దూసుకెళ్లే ఆకాష్ క్షిపణి ప్రయోగం సక్సెస్ అయినట్టు డీఆర్డీఓ ఒక ప్రకటనలో వెల్లడించింది. లక్ష్య ప్రమాణాల మేరకు టెస్ట్‌ జరిగినట్లు తెలిపింది. ఈ ట్రయల్ మధ్యాహ్నం 12: 45 గంటలకు భూ ఆధారిత ప్లాట్ ఫాం నుంచి ప్రయోగించారు.

మల్టీఫంక్షన్ రాడర్, కమాండ్, కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఆయుధాల వ్యవస్థను అమర్చారు. ఈ క్షిపణి వ్యవస్థను ఇతర DRDO ల్యాబరేటరీ సహకారంతో హైదరాబాద్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ (DRDL) అభివృద్ధి చేసింది. రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన ప్రకారం.. భారత వైమానిక దళం ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ప్రొడక్షన్ ఏజెన్సీలు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) కూడా ట్రయల్స్‌లో పాల్గొన్నాయి.


మరోవైపు ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా ఆర్మీని బలోపేతం చేసేందుకు దేశీయంగా అభివృద్ధి చేసిన తక్కువ బరువున్న మ్యాన్-పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణిని DRDO విజయవంతంగా పరీక్షించింది. థర్మల్ సైట్‌తో అనుసంధానించిన మ్యాన్-పోర్టబుల్ లాంచర్ నుంచి ఈ క్షిపణిని ప్రయోగించింది. ట్యాంక్‌ నమూనా లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో నాశనం చేసిందని కనీస పరిధి పరీక్ష విజయవంతమైందని తెలిపింది.