Earthquake : అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో భూకంపం

అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. శుక్రవారం రాత్రి క్యాంప్‌బెల్‌ బేలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.2గా నమోదైందని ఎన్‌సీఎస్‌ తెలిపింది.

Earthquake : అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో భూకంపం

Earthquake

Andaman and Nicobar Islands : అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. శుక్రవారం రాత్రి క్యాంప్‌బెల్‌ బేలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.2గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మాలజీ పేర్కొంది. భూ అంతర్భాగంలో 63 లోతులో భూమి కంపించిందని వెల్లడించింది. ప్రజలు భయంతో పరుగులు తీశారు.

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో తరచూ భూకంపాలు సంభవిస్తున్నాయి. ఈ నెల 22న కూడా అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. రాత్రి 11.45 గంటలకు ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవించింది. ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

NASA : మార్స్‌పై మరోసారి భూకంపం..ఈసారి తీవ్రత ఎంతంటే

భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదైంది. పోర్ట్‌బ్లెయిర్ పట్టణానికి 202 కిలోమీటర్ల దూరంలో భూమికి 10కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఏర్పడిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ వెల్లడించింది.