Kerala : మావటికి నివాళులు అర్పించిన ఏనుగు..కంటతడిపెట్టిస్తోంది, వీడియో వైరల్

మూగ జీవాలు చూపించే ప్రేమ అమూల్యం. ఏనుగును సంరక్షణ చూసుకొనే వాడు ఓ వ్యక్తి. ఆరు దశాబ్దాలుగా ఏనుగుల బాగు కోసం పాటు పడేవాడు. ఆ వ్యక్తి చనిపోవడంతో ఓ ఏనుగు చలించిపోయింది. మృతదేహం వద్దకు వచ్చి..రెండు మూడు నిమిషాలు నిల్చొని..తొండాన్ని అటూ ఇటూ కదిపింది.

Kerala : మావటికి నివాళులు అర్పించిన ఏనుగు..కంటతడిపెట్టిస్తోంది, వీడియో వైరల్

Kerala

Elephant Bids Emotional Farewell : జంతువులు అంటే..కొంతమందికి చాలా ప్రేమ ఉంటుంది. వాటిని పెంచుకుంటుంటారు. వాటి సంరక్షణ కోసం పాటు పడుతుంటారు. ఆ మూగ జీవాలు చూపించే ప్రేమ అమూల్యం. ఏనుగును సంరక్షణ చూసుకొనే వాడు ఓ వ్యక్తి. ఆరు దశాబ్దాలుగా ఏనుగుల బాగు కోసం పాటు పడేవాడు. ఆ వ్యక్తి చనిపోవడంతో ఓ ఏనుగు చలించిపోయింది. మృతదేహం వద్దకు వచ్చి..రెండు మూడు నిమిషాలు నిల్చొని..తొండాన్ని అటూ ఇటూ కదిపింది. విగత జీవుడిగా ఉన్న మావటిని చూసి ఏనుగు ప్రదర్శించిన హావభావాలు ప్రతొక్కరిని కదలిస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళ రాష్ట్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కేరళ రాష్ట్రంలోని కొట్టాయంలో కున్నక్కడ్ దామోదరన్ నాయర్ నివాసం ఉండేవాడు. ఇతని వయస్సు 74 ఏళ్లు. ఈ వ్యక్తి ఏనుగుల సంరక్షణ చూసుకొనేవాడు. ఇతడిని స్థానికులు ఓమన్ చెట్టన్ అని పిలుచుకొనే వారు. పాల్ఘట్ బ్రహ్మదత్తన్ అనే పేరు గల ఏనుగు బాగోగులు చూసుకొనేవాడు. ఓమన్ చెట్టన్ కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నాడు. ఈ వ్యాధితో 2021, జూన్ 04వ తేదీ శుక్రవారం చనిపోయాడు. పాల్ఘాట్ ఓమన్ ఇంటికి వచ్చింది. ఆ ఏనుగు తొండెం అటూ ఇటూ ఊపుతూ…నివాళులర్పించింది. స్థానికంగా ఉన్న వారు ఈ దృశ్యాన్ని చూసి చలించిపోయారు. దామోదరన్ నాయర్ కుటుంబసభ్యుడు ఏనుగు వద్దకు వచ్చి..కన్నీటి పర్యంతమయ్యాడు.

Read More : Donald Trump : కరోనా కల్లోలానికి కారణం చైనాయే.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు