ఎమోషనల్ గా ప్రజలను మానిప్యులేట్ చేస్తున్నారు: కమల్ హాసన్

  • Published By: Subhan ,Published On : June 21, 2020 / 03:06 PM IST
ఎమోషనల్ గా ప్రజలను మానిప్యులేట్ చేస్తున్నారు: కమల్ హాసన్

నటుడు-రాజకీయ నాయకుడు అయిన కమల్ హాసన్ ప్రధాని నరేంద్రమోడీని హెచ్చరిస్తున్నారు. గత వారం లడఖ్ లోని గాల్వాన్ లోయలో ఇండియా-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ గురించి చెప్తూ ఎమోషనల్ గా మానిప్యులేట్ చేస్తున్నారని అన్నారు. ఈ ఘర్షణల్లో 20మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా డజన్ల కొద్దీ గాయాలకు గురయ్యారు. 

శుక్రవారం జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ లో ప్రధాని చేసి కామెంట్లపై స్ట్రాంగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ‘మన భూభాగంలోకి రాలేదు ఒక్క పోస్ట్ కూడా ఆక్రమించలేదు’ అని కామెంట్ చేశారు. అబద్ధాలు చెప్పి ఇంకా మానిప్యులేషన్ కొనసాగిస్తున్నారు. ప్రధానితో పాటు అతని అనుచరులను కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. 

ప్రశ్నలు వేస్తున్నామని జాతి వ్యతిరేకులుగా భావించవద్దు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉంది కాబట్టే అడుగుతున్నా. నిజం తెలిసేవరకూ అడుగుతూనే ఉంటాం. అని కమల్ అడిగారు. ఆల్ పార్టీ మీటింగ్ లో ప్రధాని కామెంట్లకు ఆర్మీ, విదేశాంగ మంత్రిత్వ శాఖ చేసిన కామెంట్లకు పోలిక లేదని అంటున్నారు. 

శుక్రవారం ఆల్ పార్టీ మీటింగ్ ముగిసిన తర్వాత ప్రతిపక్షాల విమర్శలు ఎక్కువ అయ్యాయి. ఎల్ఏసీ వద్ద జరిగిన ఘటన గురించి స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం లాంటి వాళ్లు ప్రధాని స్టేట్‌మెంట్ పై పలు విమర్శలు గుప్పించారు.