నిరుద్యోగం పెరిగింది : 90లక్షల ఉద్యోగాలు తగ్గిపోయాయ్

  • Published By: venkaiahnaidu ,Published On : November 1, 2019 / 07:06 AM IST
నిరుద్యోగం పెరిగింది : 90లక్షల ఉద్యోగాలు తగ్గిపోయాయ్

భారత్ లో నిరుద్యోగ రేటు అక్టోబర్ లో 8.5శాతానికి పెరిగింది. సెప్టెంబర్ లో 7.2శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు ఉందని, ఆగస్టు-2016నుంచి ఈ అక్టోబర్ లోనే అత్యధిక నిరుద్యోగ రేటు నమోదైనట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(CMIE)శుక్రవారం(నవంబర్-2019)ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థ మందగమనం ప్రభావాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.

భారతదేశంలో మొత్తం ఉపాధి 2011-12 మరియు 2017-18 మధ్య క్షీణించిందని CMIE తెలిపింది. 2011-12, 2017-18లో మొత్తం ఉపాధి 90లక్షలు తగ్గిందని,భారతదేశ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని తెలిపింది. మొత్తం ఉపాధి 2011-12లో 43.3కోట్ల నుండి 2017-18లో 45.7కోట్లకు పెరిగిందని పేర్కొన్న ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలి నియమించిన లవీష్ భండారి మరియు అమరేష్ దుబే ఇటీవల చేసిన అధ్యయనానికి ఈ ఫలితం పూర్తి విరుద్ధం.  ఉపాధి 2011-12లో 47.4కోట్ల నుండి 2017-18లో 46.5 కోట్లకు పడిపోయిందని CMIE తెలిపింది.

దేశ మౌలిక సదుపాయాల ఉత్పత్తి సెప్టెంబరులో 5.2 శాతం పడిపోయింది. ఇది అంతకుముందు సంవత్సరం కంటే చెత్త పనితీరు అని ప్రభుత్వ గణాంకాలు గురువారం తెలిపాయి. పారిశ్రామిక ఉత్పత్తి రేటు ఆగస్టులో ఆరు సంవత్సరాలకు పైగా వేగంగా పడిపోయింది.