ఓటు గుర్తు చూపిస్తేనే సెలవు.. లేదంటే జీతం కట్

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు వేళ.. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచిస్తోంది. ఈసారి లోకసభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచడానికి ఈసీ పలు చర్యలు చేపట్టింది.

  • Published By: sreehari ,Published On : April 11, 2019 / 07:38 AM IST
ఓటు గుర్తు చూపిస్తేనే సెలవు.. లేదంటే జీతం కట్

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు వేళ.. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచిస్తోంది. ఈసారి లోకసభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచడానికి ఈసీ పలు చర్యలు చేపట్టింది.

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు వేళ.. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచిస్తోంది. ఈసారి లోకసభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచడానికి ఈసీ పలు చర్యలు చేపట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే నగరాల్లోనే పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదు అవుతున్నట్టు ఎన్నికల కమిషన్ గుర్తించింది. ఐటీ, ప్రైవేట్ సంస్థలకు తమ ఉద్యోగులను ఓటు వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఈసీ సూచించింది. 

ఈ క్రమంలో ప్రముఖ ఐటీ కంపెనీలు కూడా తమ ఉద్యోగులను తప్పనిసరిగా ఓటు వేయాలని ఆదేశించాయి. ఎన్నికల వేళ.. ఎన్నికల కమిషన్‌ సూచన మేరకు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇస్తున్నట్టు ప్రకటించాయి. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ, ఐటీ కంపెనీల ఉద్యోగులు సహా ఇతర ప్రైవేట్ ఉద్యోగులు ఎన్నికల సెలవును హాలీడే ట్రిపులకు వినియోగించుకుంటున్నారంటూ ఫిర్యాదులు వస్తున్నాయి. ఓటింగ్ సెలవును.. రెస్ట్ తీసుకోవడానికి, విహార యాత్రలకు వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారని, ఓటును బాధ్యతగా వేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఐటీ, బీటీ సంస్థలు నివారణ చర్యలు చేపట్టాయి. 

ఐటీ కంపెనీల ఓటు రూల్స్ : 
ప్రత్యేకించి బెంగళూరు ఐటీ, ప్రైవేటు కంపెనీలు ఈ చర్యలను అమల్లోకి తెచ్చాయి. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఓటింగ్‌లో పాల్గొనకుండా సెలవు తీసుకున్న ఐటీ ఉద్యోగుల విషయంలో బెంగళూరు కంపెనీలు కొన్ని నిబంధనలను విధించాయి. ఏప్రిల్ 18వ తేదీన బెంగళూరులో జరిగే ఎన్నికల పోలింగ్‌లో తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆదేశించాయి. ఓటు వినియోగించుకున్నట్టు ఆధారాలను కంపెనీ HR కు సమర్పించాల్సిందిగా రూల్స్ పెట్టాయి.

అలా చేస్తేనే.. జీతంతో కూడిన సెలవు లభిస్తుంది. లేదంటే.. సదరు ఉద్యోగులకు మంజూరు చేసిన సెలవు రద్దు చేస్తామని తెలిపాయి. ఎన్నికలకు ముందునుంచే పలు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఓటు వినియోగంపై మెసేజ్ లు పంపిస్తున్నాయి. కాగా, ఏప్రిల్ 11, 2019 గురువారం నుంచి లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ప్రారంభమయ్యాయి.