EVM, VV Pats: టీఎంసీ నేత ఇంట్లో ఈవీఎం, వీవీ ఫ్యాట్స్

పశ్చిమ బెంగాల్ లో మంగళవారం (ఏప్రిల్ - 6) మూడవ దశ పోలింగ్ జరుగుతుంది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఇక ఇదిలా ఉంటే.. టీఎంసీ నేత ఇంట్లో ఈవీఎంలు బయటపడటం కలకలం రేపింది. హౌరా జిల్లా ఉలుబెరియాలో టీఎంసీ నేత గౌతమ్ ఘోష్ ఇంట్లో నాలుగు ఈవీఎంలు దర్శనమిచ్చాయి.

EVM, VV Pats: టీఎంసీ నేత ఇంట్లో ఈవీఎం, వీవీ ఫ్యాట్స్

West Bangal

EVM, VV Pats: పశ్చిమ బెంగాల్ లో మంగళవారం (ఏప్రిల్ – 6) మూడవ దశ పోలింగ్ జరుగుతుంది. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఇక ఇదిలా ఉంటే.. టీఎంసీ నేత ఇంట్లో ఈవీఎంలు బయటపడటం కలకలం రేపింది. హౌరా జిల్లా ఉలుబెరియాలో టీఎంసీ నేత గౌతమ్ ఘోష్ ఇంట్లో నాలుగు ఈవీఎంలు దర్శనమిచ్చాయి.

ఈవీఎంలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గౌతమ్ ఘోష్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఈవీఎంలను స్వాధీనం చేసుకొని ఎన్నికల అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలికి చేరుకున్న ఎన్నికల అధికారులు పోలీసుల నుంచి ఈవీఎంలను వీవీ ఫ్యాట్స్ లను తీసుకోని స్టోర్ రూమ్ కి తరలించారు. అవి రిజర్వులో ఉన్న ఈవీఎంలా గుర్తించారు.

సెక్టార్ ఆఫీసర్‌ తపన్ సర్కార్ వీటిని తృణమూల్ నేత ఇంట్లో పెట్టినట్లు ఉన్నతాధి కారులు గుర్తించారు. తృణమూల్ నేత గౌతమ్ ఘోష్, తపన్ సర్కార్ కు బంధువు కావడంతో వారి ఇంట్లో రాత్రి నిద్రించేందుకు వచ్చారు. అయితే తనతోపాటు నాలుగు ఈవీఎంలు, వీవీ ప్యాడ్లు తీసుకెళ్లాడు. ఇది చట్ట రీత్యా నేరం.. ఈవీఎం, వీవీ ఫ్యాట్స్ ను ఎన్నికల అధికారులు కేటాయించిన స్టోర్ రూమ్స్ లో భద్రపరచాలి. కానీ తపన్ వాటిని రాజకీయ నాయకుడి ఇంటికి తీసుకెళ్లారు.

ఇది చట్టరీత్య నేరం కావడంతో సెక్టార్ ఆఫీసర్‌ తపన్ సర్కార్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. అతడితోపాటు సెక్యూరిటీగా వెళ్లిన వారిని కూడా సస్పెండ్ చెయ్యాలని ఆదేశించారు. వీరికి జరిమానా కూడా విధించినట్లు తెలుస్తుంది.

ఇక అసోంలో రెండోదశ పోలింగ్ సమయంలో ఇటువంటి ఘటనే ఒకటి వెలుగు చూస్తుంది. పోలింగ్ పూర్తైన తర్వాత బీజేపీ నేత వాహనాల్లో ఈవీఎంలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో నలుగురు అధికారులను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎన్నికల పర్యవేక్షణ అధికారి ఉత్తర్వులు జారీచేశారు.