Odisha: అవమానాన్ని తట్టుకోలేకే.. బీజేపీకి రాజీనామా చేసిన మాజీ సీఎం.. బీఆర్ఎస్‭లో చేరే ఛాన్స్

ఇక గిరిధర్ కుమారుడు శిశిర్ మాట్లాడుతూ ‘‘పార్టీలోని పరిస్థితుల గురించి ఎన్నో సార్లు కేంద్ర నాయత్వానికి తెలియజేశాను. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‭కు చాలా సార్లు ఫిర్యాదు చేశాను. కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీస మర్యాద లేని చోట ఉండలేము. అందుకే పార్టీ వీడుతున్నాం’’ అని అన్నారు

Odisha: అవమానాన్ని తట్టుకోలేకే.. బీజేపీకి రాజీనామా చేసిన మాజీ సీఎం.. బీఆర్ఎస్‭లో చేరే ఛాన్స్

Ex-Odisha CM Giridhar Gamang quits BJP says faced humiliation

Odisha: ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత గిరిధ్ గమాంగ్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా పార్టీకి రాజీనామా చేశారు. అయితే వీరు తొందరలోనే భారత్ రాష్ట్ర సమితి పార్టీలో చేరనున్నట్లు సమాచారం. చాలా కాలంగా పార్టీలో తీవ్రమైన అవమానం ఎదుర్కొంటున్నానని, తనకు భరించే ఓపిక నశించి పార్టీని వీడినట్లు రాజీనామా అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు. ఈ విషయమై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘పార్టీలో చాలా కాలంగా తీవ్రమైన వివక్ష, అవమానాల్ని ఎదుర్కొంటున్నాను. నా ఓపిక ఉన్నంత వరకు భరించాను. కానీ ఇంకా భరించే ఓపిక నాకు లేదు. అందుకే పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను’’ అని అన్నారు.

Republic Day Parade: గణతంత్ర దినోత్సవ పరేడ్‭కు పంజాబ్ శకటాన్ని తిరస్కరించిన కేంద్రం

ఇక గిరిధర్ కుమారుడు శిశిర్ మాట్లాడుతూ ‘‘పార్టీలోని పరిస్థితుల గురించి ఎన్నో సార్లు కేంద్ర నాయత్వానికి తెలియజేశాను. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‭కు చాలా సార్లు ఫిర్యాదు చేశాను. కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీస మర్యాద లేని చోట ఉండలేము. అందుకే పార్టీ వీడుతున్నాం’’ అని అన్నారు. తండ్రీ-కొడుకులు ఇద్దరూ తొందరలోనే కేసీఆర్ నాయకత్వంలోని భారత్ రాష్ట్ర సమితి పార్టీలో చేరనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేసీఆర్‭తో చర్చలు జరిగాయని, మరి కొద్ది రోజుల్లోనే ఒడిశాలో భారీ సభ ఏర్పాటు చేసి వీరిని గులాబీ పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు ఊహాగాణాలు వస్తున్నాయి.

Lakhimpur Kheri Violence: రైతులపై హత్యాయత్నం.. లఖీంపూర్ ఖేరి నిందితుడికి బెయిల్ మంజూరు