23 నుంచి రైతు నిరసనలు ఉద్ధృతం

Farmers నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు తమ ఆందోళనను ఉద్ధృతం చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 23- 27 మధ్య వరుస నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆదివారం ప్రకటించారు.
ఫిబ్రవరి 23న పగాడి సంభాల్ దివస్‌గా, ఫిబ్రవరి 24న ‘దామన్ విరోధి దివస్’గా, ఫిబ్రవరి 26న ‘యువరైతు దినోత్సవం’, ఫిబ్రవరి 27న ‘మజ్దూర్-కిసాన్ ఏక్తా దివస్(రైతు, కార్మిక ఐక్య దినోత్సవం)గా జరుపుతామని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు తెలిపారు.
ఆందోళనలను విస్తృతం చేసేందుకు త్వరలో ఒక వ్యూహాన్ని రూపొందిస్తామని చెప్పారు. ప్రభుత్వం తమపై అణచివేత ధోరణి ప్రదర్శిస్తోందని రైతు నాయకుడు యోగేంద్ర యాదవ్ ఆరోపించారు. సింఘు సరిహద్దులో తమ బలం పెరిగిందని, అంతర్జాతీయ సరిహద్దులా మారిందని వ్యాఖ్యానించారు