Bsnl : బిఎస్ఎన్ ఎల్ లో అప్రంటీస్ ఖాళీల భర్తీ

ఎంపికైన అప్రెంటీస్ కు నెలకు రూ. 8 వేల ఉపకార వేతనం చెల్లిస్తారు. ఇప్పటికే అప్రంటీస్ గా పని చేస్తున్నవారు, ఏడాది అంతకన్నా ఎక్కువగా పని చేసిన అనుభవం ఉన్న వారు అప్లై చేసేందుకు అనర్హులని తెలిపారు.

Bsnl : బిఎస్ఎన్ ఎల్ లో అప్రంటీస్ ఖాళీల భర్తీ

Bsnl

Bsnl : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)అప్రంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో తెలిపారు.. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు అప్రంటీస్ విధానంలో ఏడాది పాటు పని చేయాల్సి ఉంటుంది.

ఎంపికైన అప్రెంటీస్ కు నెలకు రూ. 8 వేల ఉపకార వేతనం చెల్లిస్తారు. ఇప్పటికే అప్రంటీస్ గా పని చేస్తున్నవారు, ఏడాది అంతకన్నా ఎక్కువగా పని చేసిన అనుభవం ఉన్న వారు అప్లై చేసేందుకు అనర్హులని తెలిపారు. ఇంజనీరింగ్,టెక్నాలజీలో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. 2019, 20, 21లో పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని ప్రకటనలో తెలిపారు.

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు డిసెంబర్ 2ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 2వ తేదీలోపు www.mhrdnats.gov.in వెబ్ సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.