Coronavirus India Update: భారత్ లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. 50వేలకు పైగా నమోదు!

భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయని సంతోషించినంత సేపు పట్టలేదు. మళ్లీ కేసులు పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది పాజిటివ్ కేసుల నమోదు చూస్తుంటే. మంగళవారం (జూన్ 22,2021) ఒక్కరోజే 50,848 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది.

Coronavirus India Update: భారత్ లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. 50వేలకు పైగా నమోదు!

For Day 50,848 Positive Cases Covid19 In India

Coronavirus Cases in India : భారత్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయని సంతోషించినంత సేపు పట్టలేదు. మళ్లీ కేసులు పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది పాజిటివ్ కేసుల నమోదు చూస్తుంటే. ఈక్రమంలో మంగళవారం (జూన్ 22,2021) ఒక్కరోజే 50,848 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,00,28,709కు చేరింది. అలాగే మృతుల సంఖ్య మొత్తం 3,90,660 గా ఉంది. పరీక్షల సంఖ్య 39,59,73,198 చేశారు.

కేంద్రం తెలిపిన లెక్క ప్రకారం.నిన్న ఒక్కరోజే 50,848 కేసులు కొత్త కేసులు నమోదు కాగా.. 68,817 మంది కోలుకోవటం మంచి పరిణామం అని చెప్పాలి. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,00,28,709కు చేరింది.

ఇక మరణాల విషయానికొస్తే, నిన్న 1,358 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,90,660 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,89,94,855 మంది కోలుకున్నారు. 6,43,194 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

కాగా..దేశంలో నిన్నటి వరకు మొత్తం 39,59,73,198 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 19,01,056 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.కాగా కరోనా కేసులు తగ్గుతున్నాయనుకుంటున్న క్రమంలో మరోసారి కేసులు పెరగటం ఆందోళన కలిగిస్తోంది. నిన్నటికంటే 8వేలకు పైగా కేసులు పెరిగాయి. దేశవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 54.24 లక్షల డోసుల కరోనా టీకాలు వేసినట్లుగా కేంద్రం వెల్లడించింది.