Adulterated Liquor Four Died : బిహార్ లో కల్తీ మద్యం తాగి మరో నలుగురు మృతి

బిహార్ లో మద్యపాన నిషేధం అమలులో ఉన్నా కల్తీ మద్యం ఏరులై పారుతోంది. రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి 50 మందికిపైగా మృతి చెందిన ఘటన మరువకముందే తాజాగా కల్తీ మద్యం సేవించి మరో నలుగురు మరణించారు.

Adulterated Liquor Four Died : బిహార్ లో కల్తీ మద్యం తాగి మరో నలుగురు మృతి

adulterated liquor

Adulterated Liquor Four Died : బిహార్ లో మద్యపాన నిషేధం అమలులో ఉన్నా కల్తీ మద్యం ఏరులై పారుతోంది. రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి 50 మందికిపైగా మృతి చెందిన ఘటన మరువకముందే తాజాగా కల్తీ మద్యం సేవించి మరో నలుగురు మరణించారు. సివన్ జిల్లాలోని భగవాన్ పూర్ లో కల్తీ మద్య తాగిన నలుగురు వ్యక్తులు మృతి చెందారు.

2016 ఏప్రిల్ నెలలో బీహార్ లో మద్యపానాన్ని నిషేధించారు. రాష్ట్రంలో మద్యం తయారీ, అమ్మకాలను నితీష్ కుమార్ ప్రభుత్వం నిషేధించింది. రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి పలువురు మరణిస్తుండటం పట్ల నితీష్ కుమార్ ప్రభుత్వంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.

Bihar : రాష్ట్రంలో మద్య నిషేధం.. కల్తీ మద్యం తాగి స్కూల్‌ ప్రిన్సిపల్‌తో సహా ముగ్గురు మృతి

మరోవైపు చప్రా కల్తీ మద్యం వ్యవహారంలో సిట్ విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. రాష్ట్రంలో మద్యం తయారీ, అమ్మకాలు, అక్రమ మద్యం అరికట్టడం కోసం ప్రణాళిక చేపట్టాలని పిటిషనర్ డిమాండ్ చేశారు.