మర్యాదగా పంపేశారు: CAA ఆందోళనలో జర్మన్ విద్యార్థి

మర్యాదగా పంపేశారు: CAA ఆందోళనలో జర్మన్ విద్యార్థి

జాకోబ్ లిండేన్థాల్(Jacob Lindenthal) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (IIT Madras)లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. సీఏఏ అంశంపై తోటి విద్యార్థులతో ఆందోళనలో పాల్గొనడంతో వెంటనే వెళ్లిపోవాలంటూ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ ఆదేశాలిచ్చింది. దీంతో చదువు మధ్యలో ఆపేసి ఆమ్‌స్టర్‌డమ్ వెళ్లిపోయాడు. లాయర్లతో మాట్లాడుకున్న తర్వాతే మళ్లీ క్యాంపస్ లోకి అడుగుపెట్టడానికి వీలుంటుందని ఇమిగ్రేషన్ శాఖ ఆదేశాలిచ్చింది. 

ఆందోళనలో పాల్గొనడమంటే వీసా నియమాలను ఉల్లంఘించినట్లేనని చెన్నైలోని అధికారులు వెల్లడించారు. ‘ఈ వీకెండ్‌లో బెంగళూరులో ఉన్నాను. సోమవారం ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంట్‌కు వెళ్లాలని కో ఆర్డినేటర్ చెప్పారు. అక్కడకు వెళ్లి మాట్లాడను. నా వీసాపై అడ్మినిస్ట్రేషన్ సమస్యలు వచ్చిపడ్డాయి. నా రాజకీయ అభిప్రాయాలకు దీనికి సంబంధమేంటి అని ఇమిగ్రేషన్ ఆఫీసర్ ను ప్రశ్నించాను’ 

 

‘దానికి నన్ను దేశం వదిలివెళ్లిపోవాల్సిందిగా ఆదేశాలు వచ్చాయి. ఇదంతా మధ్యాహ్నం 2గంటలకు జరిగింది. 3గంటలకు  (IIT Madras) క్యాంపస్‌ను వదిలివచ్చేశాను. లాయర్లను కలిసి కోర్సు ఎలా పూర్తి చేయాలనేది తెలుసుకుంటాను. ఆందోళనలో పాల్గొనడం గురించి ప్రశ్నిస్తే.. నేను నా స్నేహితులకు మద్ధతు ఇచ్చాను. నేనే అభిప్రాయాన్ని, వ్యతిరేకతను గానీ వ్యక్తం చేయలేదు. అప్పటికీ 144సెక్షన్ అమలులో లేదు. చెపాక్, వాల్లువర్ కొట్టాం ప్రాంతాలకు స్నేహితులతో కలిసివెళ్లాను.’

 

క్యాంపస్ వదిలి వెళ్తుండగా మీడియా సమావేశంలో పాల్గొన్న అతను.. భారత రాజ్యంగం గురించి కొన్ని ప్రశ్నలు వేశాడు. మెయిల్ ద్వారా అడిగిన ప్రశ్నలకు అతనికి ఇంకా ఐఐటీ మద్రాస్ క్యాంపస్ నుంచి బదులురావాల్సి ఉంది. ఆందోళనలో కేవలం రెండు ప్లకార్డులను మాత్రమే పట్టుకుని ఉన్నాడు. ఒకటి ‘1933-1945 వుయ్ హేవ్ బీన్ దేర్'(1933-1945మధ్య మాకు అక్కడ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. యూనిఫార్మ్‌డ్ క్రిమినల్స్(క్రిమినల్స్ యూనిఫామ్ లలో తిరుగుతున్నారు. అని పెట్టుకుని తోటి విద్యార్థులతో కలిసి నిరసన వ్యక్తం చేశాడు.