Goa: కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు

గోవా ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రియాంకాగాంధీ ప్రకటించారు.

Goa: కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు

Goa Polls Priyanka Gandhi

Goa Assembly Elections 2022 : గోవాలో త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఈక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మానిఫెస్టోను ప్రియాంకా గాంధీ విడుదల చేశారు. దీంట్లో భాగంగా మహిళలకు హామీలు గుప్పించారు. గోవాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వోద్యోగాల్లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రె ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రకటించారు. ఉపాధి కల్పనకు రూ.500 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు.

Also read : Goa Assembly Election 2022: ‘ఒట్టు నిజ్జంగా పార్టీ మారం’..గోవా కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రతిజ్ఞ

సోమవారం (ఫిబ్రవరి 8,2022) నువెం అసెంబ్లీ సెగ్మెంట్లో బహిరంగ సభనుద్దేశించి ప్రియాంకా గాంధీ మాట్లాడుతు ఈ హామీలు ఇచ్చారు. ఉద్యోగ ఖాళీల భర్తీలో కుంభకోణాలకు చెక్‌ పెట్టడానికి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. న్యాయ్‌ పథకం కింద పేదలకు నెలకు రూ.6,000 అందిస్తామని తెలిపారు. అంతేకాదు గోవాలో మహిళా పోలీస్‌ స్టేషన్ల సంఖ్యను పెంచుతామని..మార్గోవా, పణజిల్లో వర్కింగ్‌ విమెన్‌కు హాస్టళ్లు, పెట్రోలు, డీజిల్‌ ధరలు లీటరుకు రూ.80 మించకుండా చూడటం వంటి పలు హామీలను మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ప్రకటించింది.

Also read : BTech question paper : సినిమా కథపై బీటెక్ పశ్నాపత్రం..విద్యార్ధులు షాక్..

40 మంది సభ్యుల గోవా అసెంబ్లీలో 2017 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఏకైక అతి పెద్ద పార్టీగా నిలిచింది. కానీ ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు చేయలేకపోయింది. ఈ అవకాన్ని బీజేపీ చక్కగా సద్వినియోగం చేసుకుని పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకుంది. చిన్న పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులను ఆకట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈక్రమంలో కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా గోవాలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోంది.

Also read : Goa Assembly Election : ప్రతి పేదవాడికి నెలకు రూ. 6 వేలు.. రాహుల్ వరాలు

కాగా…గోవా ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ కొత్త సంప్రదాయానికి తెర తీసిన రాహులు గాంధీ ‘కాంగ్రెస్ పార్టీకి మేం ఎప్పుడు విధేయులుగా ఉంటాం పార్టీ మారబోం’ అంటూ గోవాలో కాంగ్రెస్‌ అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కాగా..గోవాలో ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి. గోవా అసెంబ్లీ ఎన్నికలు 2022 ఫిబ్రవరి 14న జరగనుంది. భారత ఎన్నికల సంఘం ప్రకారం మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. గోవాలో గెలుపు కోసం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా శ్రమిస్తున్నారు.కొత్త పథకాలను ప్రకటిస్తున్నారు.

Also read : Viral News : చంటిబిడ్డను ఎత్తుకుని..టీవీ లైవ్‌లో రిపోర్టింగ్