Covovax Vaccine: ఆ మూడు దేశాలకు 7కోట్ల వ్యాక్సిన్ల ఎగుమతి
సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసిన కొవోవ్యాక్స్ వ్యాక్సిన్ ను ఏడు దేశాలకు ఎగుమతి చేసేందుకు గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు..

Novovax
Covovax Vaccine: సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెవలప్ చేసిన కొవోవ్యాక్స్ వ్యాక్సిన్ ను ఏడు దేశాలకు ఎగుమతి చేసేందుకు గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు ఈ జాబితాలో ఉన్నాయని బుధవారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ అండ్ రెగ్యూలేటరీ అఫైర్స్ డైరక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ ఈ అప్లికేషన్ ను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు సబ్ మిట్ చేశారు. విదేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి చేసేందుకు అభ్యంతరం తెలపకూడదని కోరుకున్నారు. ‘అప్లికేషన్ పరిశీలించిన డీసీజీఐ ఆఫీస్ 7కోట్ల వ్యాక్సిన్లు పంపేందుకు ఎటువంటి అభ్యంతరాలు చెప్పకుండానే అప్రూవల్ ఇచ్చింది.
కాకపోతే ఈ దేశాల్లో కొవావ్యాక్స్ వ్యాక్సిన్ కు అప్రూవల్ రాలేదు.
ఇది కూడా చదవండి : ఏపీ సినిమా టికెట్ల ధరలపై ఆర్జీవీ వ్యాఖ్యలు
దేశంలోని అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగం కోసం ఇండియన్ సెంట్రల్ డ్రగ్ అథారిటీ CDSCO మంగళవారం Covovaxని ఆమోదించింది. DCGI కార్యాలయం మే 17న Covovaxని తయారు చేయడానికి, నిల్వ చేయడానికి SII అనుమతిని మంజూరు చేసింది. DCGI ఆమోదం ఆధారంగా, ఇప్పటి వరకు, పూణేకు చెందిన సంస్థ వ్యాక్సిన్ మోతాదులను తయారు చేసి నిల్వ చేసిందని అన్నారు.