Lakshmi Vilas Bank ఖాతా క్లోజ్

  • Published By: madhu ,Published On : November 26, 2020 / 08:25 AM IST
Lakshmi Vilas Bank ఖాతా క్లోజ్

Lakshmi Vilas Bank with DBS : సంక్షోభంలో చిక్కుకున్న లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ కొనుగోలుకు కేంద్ర మంత్రివర్గం ఓకే చెప్పింది. సింగపూర్‌లోనే అతిపెద్ద బ్యాంక్‌ అయిన డీబీఎస్‌ భారత్‌కు చెందిన ఈ బ్యాంక్‌ను కొనుగోలు చేసేందుకు అన్ని అనుమతులు ఇచ్చింది. ఒక విదేశీ బ్యాంక్‌ భారత్‌ బ్యాంక్‌ను బెయిల్‌ఔట్‌ చేయడానికి ముందుకు రావడం ఇదే తొలిసారి. విలీన స్కీమ్‌కు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపిన కొన్ని గంటల్లోనే దీనిపై ఒక ప్రకటన చేసిన రిజర్వ్‌ బ్యాంక్‌ .. నవంబర్‌ 27 నుంచి విలీనం అమల్లోకి వస్తుందని తెలిపింది.



ఆ రోజు నుంచి లక్ష్మీ విలాస్ బ్యాంక్‌పై విధించిన మారటోరియం కూడా తొలగిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో 25 వేల విత్‌డ్రాయల్‌ పరిమితులు తొలగిపోనున్నాయి. 27 నుంచి ఎల్‌వీబీ శాఖలన్నీ కూడా ఆ రోజు నుంచి డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా శాఖలుగా మారనున్నాయి.



https://10tv.in/uae-temporary-visa-restrictions-on-muslim-countries/
ఈ ఏడాది ప్రభుత్వ చొరవతో గట్టెక్కుతున్న బ్యాంకుల్లో లక్ష్మీవిలాస్‌ రెండోది. ఈ డీల్‌ కింద డీబీఎస్‌ 563 బ్రాంచిలను, 974 ఏటీఎంలు, 1.6 బిలియన్‌ డాలర్ల రుణాలు డీబీఎస్‌కు బదిలీ అయ్యాయి. 94 ఏళ్ల చరిత్ర ఉన్న లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ వాటాలు మొత్తం విలువ కోల్పోయాయి. దీంతో ఈ బ్యాంక్‌ డిపాజిట్లు డీబీఎస్‌ ఇండియా బుక్స్‌లోకి చేరనున్నాయి. లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ విలీన స్కీమ్‌పై కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీని ప్రకారం ఎల్‌వీబీ ఉద్యోగులందరికీ కూడా నవంబర్‌ 17నకు ముందు నుంచి అందుకుంటున్న వేతనాలు, సర్వీసు నిబంధనలే ఇకపైనా వర్తించనున్నాయి.