Dwarka : ద్వారకలో శ్రీకృష్టుడి దేవాలయానికి పిడుగుపాటు.. చిరిగిన దేవాలయం జెండా..

గుజరాత్ లోని ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయిన శ్రీ కృష్ణ ఆలయం సమీపంలో పిడుగు పడింది. ఈ పిడుగుపాటుకు ద్వారకాధీశుడు దేవాలయంపై ఉండే జెండా స్తంభానికి పిడుగు పాటు దెబ్బ తగిలింది. ఆలయ నిర్మాణం ఏమాత్రం చెక్కు చెదరలేదుగానీ..గుడి పైభాగాన ఉండే జెండా చిరిగిపోయింది.

Dwarka : ద్వారకలో శ్రీకృష్టుడి దేవాలయానికి పిడుగుపాటు.. చిరిగిన దేవాలయం జెండా..

Lightning Strike Dwarka Sri Krishna Temple

lightning strike dwarka Sri Krishna temple : కాగా కొన్ని రోజులుగా భారత్ లోని కొన్ని రాష్టాల్లో పిడుగులు పడుతున్న విషయం తెలిసిందే. యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో పిడుగులు పడ్డాయి. ఈ ప్రకృతి వైపరీత్యానికి దాదాపు 90మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం (జులై 13,2021)న గుజరాత్ లోని ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయిన శ్రీ కృష్ణ ఆలయం సమీపంలో కూడా పిడుగు పడింది. ఈ పిడుగుపాటుకు ద్వారకాధీశుడు దేవాలయంపై ఉండే జెండా స్తంభానికి పిడుగు పాటు దెబ్బ తగిలింది. పిడుగు పాటుకు ఆలయ నిర్మాణం ఏమాత్రం చెక్కు చెదరలేదుగానీ..గుడి పైభాగాన ఉండే జెండా మాత్రమే చిరిగిపోయింది.

ఈ పిడుగుపాటుకు 1200ల సంవత్సరాల పురాతన చరిత్ర కలిగిన దేవాలయం మాత్రం ఏమాత్రం చెక్కు చెదరకపోవటం గమనించాల్సిన విషయం. ఆలయ నిర్మాణం చెక్కు చెదరలేదు గానీ..గుడి పైభాగాన ఉండే జెండా మాత్రమే చిరిగిపోయింది. పిడుగు పాటుకు ఆలయ గోడలు కాస్త నల్లరంగుకు మారాయి. కాగా ద్వారకాధీశుడు దేవాలయం చుట్టూ ఎన్నో నివాసాలు ఉన్నాయి. వారికి కూడా ఎటువంటి ప్రమాదం కలుగకపోవటం మరో విశేషం. దీనిపై స్థానిక ప్రజలు మాట్లాడుతూ..‘‘అంత పెద్ద పిడుగు పడినా మాకు ఎవ్వరకూ ఎటువంటి ప్రమాదం జరగలేదు. అంతా ద్వారకాధీశుడి మహిమేననీ..ఆ కిట్టయ్యే మమ్మల్ని కాపాడాడు’’ అని అంటున్నారు. శ్రీకృష్ణుడి ఆలయం సమీపంలో పిడుగు పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

భారత్ లో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో ఈ శ్రీకృష్ణ ఆలయం కూడా ఒకటి అయిన ద్వారకాధీశ్ ఆలయం ద్వారకాలోని గోమతి నది ఒడ్డున ఉంది. ఈ దేవాలయం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఈ గుడిని జగత్ మందిర్ అని కూడా పిలుస్తారు. ఇక ద్వారకాధీశుడి ఆలయంపై ఎగిరే జెండాకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. 52 గజాల ఈ జెండాను రోజుకు 3 సార్లు ఎగురవేస్తారు. బద్రీనాథ్, పూరీ, రామేశ్వరం, ద్వారకను కలిపి చార్ ధామ్ యాత్రగా పేర్కొంటారు. ద్వారకాకు అంతటి విశిష్టత ఉంది. ద్వారకాధీశుడిని ప్రతీ ఏటా లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. కాగా..ఈ వర్షాకాలపు సీజన్ ప్రారంభమంది మొదలు ఉత్తరాదిన భారీ వర్షాల ధాటికి పలు ప్రాంతాల్లో మెరుపులతో కూడిన పిడుగులు కూడా పడుతున్నాయి. యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పిడుగు పాటుకు ఇప్పటికే 70 మందికి పైగా మరణించారు. వీరి సంఖ్య పెరిగి దాదాపు 90కి చేరినట్లుగా సమాచారం.