Ind Vs SA T20 Series: మేం ఓడిపోవటానికి ప్రధాన కారణం అతడే.. పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

టీమిండియా ఓటమిపాలైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 సిరీస్ లో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. గురువారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ భారీ స్కోర్ చేసింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ పరుగులు చేయకుండా నియంత్రించడంలో ఇండియన్ బౌలర్లు విఫలమయ్యారు. ఫలితంగా ఏడు వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది

Ind Vs SA T20 Series: మేం ఓడిపోవటానికి ప్రధాన కారణం అతడే.. పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Panth

Ind Vs SA T20 Series: టీమిండియా ఓటమిపాలైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 సిరీస్ లో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. గురువారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ భారీ స్కోర్ చేసింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ పరుగులు చేయకుండా నియంత్రించడంలో ఇండియన్ బౌలర్లు విఫలమయ్యారు. ఫలితంగా ఏడు వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. నిర్ణీత ఓవర్లలో భారత్ 211/4 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 212/3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా డేవిడ్ మిల్లర్ (31 బంతుల్లో 64 పరుగులు) చేశారు.

India Vs South Africa: హాట్ కేక్ లా భారత్ సౌతాఫ్రికా టీ20 టికెట్లు

మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ రిషబ్ పత్ మాట్లాడుతూ.. మేం మంచి స్కోరు నమోదు చేశాం. కానీ ఆ తర్వాత మా ప్రణాళికలను పక్కాగా అమలు చేయలేక పోయామని తెలిపాడు. మిల్లర్, వాన్ డెర్ డసెన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారంటూ పంత్ అభినందించారు. తమ బ్యాటింగ్ ప్రదర్శన సంతృప్తిగానే ఉందని, కానీ  డేవిడ్‌ మిల్లర్‌ను కట్టడి చేయటంలో బౌలర్లు విఫలమయ్యారని, ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేదన్నారు. అయితే వికెట్ బ్యాటింగ్ కు అనుకూలించడం వల్లనే బౌలర్లు వికెట్లు రాబట్టలేక పోయారంటూ పంత్ తెలిపాడు. రెండవ టీ20 మ్యాచ్ ఆదివారం కటక్ లో జరుగుతుంది.

Hindus in Pakistan: పాకిస్థాన్‌లో ఎన్ని లక్షల మంది హిందువులు నివసిస్తున్నారో తేల్చిన ఎన్ఏడీఆర్ఏ నివేదిక

ఇదిలాఉంటే దక్షిణాఫ్రికాపై ఓటమితో వరుసగా 13వ సారి గెలుపొంది ప్రపంచ రికార్డు సృష్టించాలన్న టీమిండియా కల నెరవేరలేదు. మరోవైపు మొదటి మ్యాచ్ కు ముందు కేఎల్ రాహుల్ గాయపడటంతో గురువారం ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో పంత్ కెప్టెన్ గా వ్యవహరించారు. భారత టీ20 కెప్టెన్‌గా రిషబ్ పంత్ అరంగేట్రం ఆశించిన స్థాయిలో జరగలేదు. దీంతో భారత కెప్టెన్‌గా తొలి టీ20లో ఓడిపోయిన తర్వాత దురదృష్టకర జాబితాలో విరాట్ కోహ్లీకి రిషబ్ పంత్ చేరాడు.