టైమ్, మనీ సేవ్ : రైల్వే స్టేషన్ లో ‘హెల్త్ ఏటీఎం’ 

  • Published By: veegamteam ,Published On : November 5, 2019 / 04:31 AM IST
టైమ్, మనీ సేవ్ : రైల్వే స్టేషన్ లో ‘హెల్త్ ఏటీఎం’ 

‘హెల్త్ ఏటీఎం’.డబ్బుల్ని డ్రా చేసుకోవటానికి ఏటీఎంలు ఉంటాయని తెలుసు.కానీ.. హెల్త్ ఏటీఎం ఏంటీ? అనుకోవచ్చు. ఏదైనా టెస్ట్ లు చేయించుకోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళితే గంటలు..రోజుల తరబడి ఎదురు చూడాలి. ప్రైవేట్ డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటే అపాయింట్ మెంట్ తీసుకోవాలి. దాని తోడు డబ్బులు భారీగా వదిలించుకోవాలి. కానీ ఈ హెల్త్ ఏటీఎం కు వెళితే నామ మాత్రపు ఖర్చుతోనే టెస్ట్ లు చేయించుకోవచ్చు. అంతేకాదు..చాలా టైమ్ కూడా సేవ్ అయ్యేలా అన్ని ఏర్పాట్లు చేశారు.  

లక్నో రైల్వే స్టేషన్ కు వచ్చిన ప్రయాణీకులు చాలామంది ఈ హెల్త్ ఏటీఎంను వినియోగించుకుంటున్నారు. ఇక్కడ కేవలం రూ.50 నుంచి 100లతో 16 రకాల హెల్త్ టెస్ట్ లు చేయించుకోవచ్చు.  

ప్రధాని మోడీ ప్రభుత్వం ఫిట్ ఇండియా ఉద్యమ కార్యక్రమంలో భాగంగా చార్బాగ్ రైల్వే స్టేషన్ దగ్గర హెల్త్ ఎటిఎమ్ ను ఏర్పాటు చేశారు. 16 రకాల టెస్ట్ లు చేయించుకున్న తరువాత రిపోర్టుల కోసం కూడా ఎక్కువ సమయం వెయిట్ చేయనక్కరలేదు. నిమిషాల్లో రిపోర్టులను అందజేసే సౌకర్యం కూడా ఈ హెల్త్ ఏటీఎంలో ఉంది. 

భారత రైల్వే సహకారంతో ‘ఫిట్ ఇండియా మూవ్‌మెంట్’ కార్యక్రమం కింద ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే లక్నో రైల్వే స్టేషన్‌లో హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేసింది.  50 నుండి 100 రూపాయలకు 16 రకాల హెల్త్ టెస్ట్ లు చేయించుకోవచ్చు. ఈ సేవలను క్రమంగా దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో కల్పించడానికి  సన్నాహాలు జరుగుతున్నాయి.