Delhi : వేడిగాలులతో ఉక్కిరిబిక్కిరి, ఢిల్లీలో 90 ఏళ్ల రికార్డు బద్దలు

వాతావరణం మారిపోతోంది. వర్షాకాలంలో ఎండ వేడిమి అధికంగా ఉంటోంది. ఉత్తరాది రాష్ట్రాలు వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. రుతుపవనాలు రెండు వారాలుగా ఆగిపోవడంతో విపరీతమైన వేడి పెరిగింది. ఉత్తర భారతదేశంలో వాతావరణం వేసవిని తలపిస్తోంది. ఎండల ప్రభావంతో సుమారు 7 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. రుతుపవనాలు ప్రారంభంలో వర్షాలు కురవడంతో ప్రజలు కొంత ఉపశమనం పొందారు. కానీ...ఇప్పుడు వేడి గాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

Delhi : వేడిగాలులతో ఉక్కిరిబిక్కిరి, ఢిల్లీలో 90 ఏళ్ల రికార్డు బద్దలు

Delhi Imd

Heat wave in Delhi : వాతావరణం మారిపోతోంది. వర్షాకాలంలో ఎండ వేడిమి అధికంగా ఉంటోంది. ఉత్తరాది రాష్ట్రాలు వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. రుతుపవనాలు రెండు వారాలుగా ఆగిపోవడంతో విపరీతమైన వేడి పెరిగింది. ఉత్తర భారతదేశంలో వాతావరణం వేసవిని తలపిస్తోంది. ఎండల ప్రభావంతో సుమారు 7 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. రుతుపవనాలు ప్రారంభంలో వర్షాలు కురవడంతో ప్రజలు కొంత ఉపశమనం పొందారు. కానీ…ఇప్పుడు వేడి గాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రాజధాని మంగేష్ పూర్ లో గురువారం 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. 90 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. 1931 జూలై 1న 45 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. అయితే అదే సమయంలో జూలై మొదటి రోజు 9 ఏళ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. 2012 జూలైలో గరిష్ట ఉష్ణోగ్రత 43.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మూడు రోజులుగా ఢిల్లీలో ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతోంది. ఢిల్లీతోపాటు హరియాణా, చండీగఢ్, యూపీల్లోనూ వేడిగాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

ఇదిలా ఉంటే…రుతుపవనాల బ్రేక్ జూలై 07 వరకు కొనసాగవచ్చని, బంగళాఖాతం నుంచి వచ్చే గాలులు ఉత్తర భారతదేశానికి చేరిన తర్వాత రుతుపవనాలు చురుగ్గా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడిస్తోంది. జూలై 03వ తేదీ నుంచి అరేబియా సుముద్రం నుంచి గుజరాత్, రాజస్థాన్ మీదుగా ఢిల్లీ వైపు తేమ గాలులు చేరుకోవడం ప్రారంభమవుతుందన్నారు.