Delhi Rain : ఢిల్లీలో కుండపోత వర్షాలు.. 40 ఏళ్ల తరువాత ఒక్క రోజులో భారీ వర్షం

1982 జులై 25 తరువాత అత్యధిక వర్షపాతం నమోదు అయింది. నాలుగు దశాబ్దాల రికార్డును బ్రేక్ చేస్తూ వర్షాలు కురుస్తున్నాయి.

Delhi Rain : ఢిల్లీలో కుండపోత వర్షాలు.. 40 ఏళ్ల తరువాత ఒక్క రోజులో భారీ వర్షం

Rain

Heavy Rain : దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో ఎడతెరిపిలేకుండా వానలు పడుతున్నాయి. 40 ఏళ్ల తరువాత ఒక్క రోజులో భారీ వర్షం కురిసింది. ఢిల్లీ ఎన్సీఆర్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. సెంట్రల్ ఢిల్లీ, నోయిడా, గురుగావ్ లో లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. వర్షాలతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి.

శనివారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల మధ్య 153 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. 1982 జులై 25 తరువాత అత్యధిక వర్షపాతం నమోదు అయింది. నాలుగు దశాబ్దాల రికార్డును బ్రేక్ చేస్తూ వర్షాలు కురుస్తున్నాయి. పగలు, రాత్రి నిర్విరామంగా వర్షం కురుస్తోంది.

2013 జులై 21న అత్యధికంగా 124.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. దశాబ్దకాలం రికార్డును బ్రేక్ చేస్తూ ఢిల్లీలో వర్షాలు కురుస్తున్నాయి. పగలు, రాత్రి నిర్విరామంగా వర్షం కురుస్తోంది. ఢిల్లీ సహా ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది.

Karnataka Heavy Rains : కర్ణాటకలో భారీవర్షాలు..8మంది మృతి

204.4 మిల్లీ మీటర్లకు మించి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడడం సహా వరద ముప్పుపై హెచ్చరికలు జారీ చేసింది.