Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

దేశవ్యాప్తంగా బంగారం ధరలు పెరిగాయి. గత మూడు రోజులుగా ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1920 డాలర్లపైకి చేరింది. అంతర్జాతీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగిన నేపథ్యంలో దేశీయంగానూ బంగారం ధరలు పెరుగుతున్నాయి.

Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

Gold Rate

Gold Price Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు పెరిగాయి. గత మూడు రోజులుగా ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1920 డాలర్లపైకి చేరింది. అంతర్జాతీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లు పెరిగిన నేపథ్యంలో దేశీయంగానూ బంగారం ధరలు పెరుగుతున్నాయి. తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగ వేళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఒక్కరోజే 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 220, అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 200 పెరిగాయి.

Gold Price Today: పెరిగిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్‌ రేట్స్ ఎలా ఉన్నాయంటే..

దేశవ్యాప్తంగా ధరలను పరిశీలిస్తే.. దేశరాజధాని న్యూ ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 200 పెరిగి రూ. 51,600కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,290 వద్ద కొనసాగుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోనూ ఇదే స్థాయిలో ధరలు ఉన్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,650, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 56,340గా ఉంది. అదేవిధంగా.. తమిళనాడు రాజధాని చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52,500కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 57,250కు చేరింది.

Gold Price: ‘వన్ ఇండియా.. వన్ గోల్డ్ రేట్’ బంగారం ధరపై కేరళ కీలక నిర్ణయం.. దేశంలోనే తొలిరాష్ట్రంగా గుర్తింపు

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలుచూస్తే.. హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,600 మార్కుకు చేరుకోగా, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 56,290గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 51,600 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 56,340గా ఉంది. విశాఖపట్టణంలో 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 51,600 ఉండగా, 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 56,080గా ఉంది. మరోవైపు వెండి ధరలుసైతం పెరుగుతున్నాయి. శనివారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో కిలో వెండిపై రూ. 100 వరకు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి ధర రూ. 74,000 వద్ద కొనసాగుతోంది.