Horse Funerals : గుర్రం అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్న వంద‌లాది మంది..లాక్ డౌన్ రూల్స్ ఏమయ్యాయో మరి..

Horse  Funerals :  గుర్రం అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్న వంద‌లాది మంది..లాక్ డౌన్ రూల్స్ ఏమయ్యాయో మరి..

Horse Funerals

people Attended at funeral of a horse : రోజురోజుకు కరోనా కేసులు..మరణాలు పెగుతున్న క్రమంలో ఏమాత్ర భయం, బాధ్యతా లేకుండా ఓ గుర్రం అంత్యక్రియల్లో పాల్గొన్న ఘటన కర్ణాటలకోని బెళగావిలో చోటుచేసుకుంది. బంధువులు చనిపోయినా అంత్యక్రియలకు అతికొద్దిమంది మాత్రమే పాల్గొనాలని రూల్స్ కొనసాగుతున్న ఈ కరోనా సమయంలో ఓ గుర్రం అంత్యక్రియలకు మాత్రం ఏకంగా వందలమంది తరలివచ్చారు. పైగ వారిలో చాలామంది మాస్కులు కూడా పెట్టుకోకపోవటం గమనించాల్సిన విషయం. కర్ణాటకలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ గుర్రానికి జరిగిన అంత్యక్రియల్లో మాత్రం లాక్ డౌన్ నిబంధలను ఎక్కడా కనిపించలేదు.దానికి తోడు కరోనా నిబంధనలు కూడా కానరాలేదు.

Hourse 1

క‌ర్ణాట‌క‌లోని బెళ‌గావిలోని మ‌రాడిమ‌ట్ ప్రాంతంలోని ఓ ఆశ్ర‌మంలో సిద్ధేశ్వ‌ర మ‌ఠానికి చెందిన ఆ గుర్రం మృతి చెందింది. ఆ గుర్రాన్ని దేవ‌తా అశ్వంగా గ్రామ‌స్థులు భావిస్తారు. పండుగ రోజుల్లో ఆ గుర్రానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ క్రమంలో దేవతా అశ్వంగా చెప్పుకునే ఆ గుర్రం మృతి చెందింది. ఈ గుర్రానికి సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు జరపాలని మఠాధిపతులు నిర్ణయించారు. దీంతో దేవతా అశ్వం అంత్య‌క్రియ‌ల‌కు స్థానికులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చారు. వందలాదిమంది తరలిరావటంతో లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించటంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

Hourse 2

దీంతో ఈ ఘటనపై క‌ర్ణాట‌క హోం శాఖ మంత్రి బ‌స‌వ‌రాజ్ స్పందించారు. జిల్లా అధికారులు ఈ విష‌యంపై ద‌ర్యాప్తు జ‌రుపుతున్నార‌ని, నిర్వాహ‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. కాగా కర్ణాటకలో లాక్ డౌన్ జూన్ 7 వరకూ కొనసాగనుంది.అప్పటి పరిస్థితులను బట్టి లాక్ డౌన్ ఎత్తివేయటమా?లేదా కొనసాగించటమా? అనేది ప్రభుత్వం నిర్ణయించనుంది. కాగా రాష్ట్రంలో లాక్ డౌన్ విధించినా కరోనా కేసులు..మరణాలు కంట్రోల్ కావటంలేదు. దీంతో జూన్ 7 తరువాత కూడా లాక్ డౌన్ కొనసాగే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది.