IBPS Clerk : డిగ్రీ అర్హతతో 7వేల 855 ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే లాస్ట్

ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగం లక్ష్యంగా ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులకు అలర్ట్. IBPS (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్) క్లరికల్ పోస్టులకు అప్లయ్ చేసుకున్నారా? లేదంటే వెంటనే..

IBPS Clerk : డిగ్రీ అర్హతతో 7వేల 855 ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే లాస్ట్

Ibps Clerk Recruitment 2021

IBPS Clerk : ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగం లక్ష్యంగా ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులకు అలర్ట్. IBPS (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్) క్లరికల్ పోస్టులకు అప్లయ్ చేసుకున్నారా? లేదంటే వెంటనే చేయండి. ఎందుకంటే దరఖాస్తు చేయడానికి ఇవాళే (అక్టోబర్ 27,2021) చివరి తేదీ.

Pan Number : పాన్ నెంబర్ ఇతరుల చేతుల్లోకి వెళ్లిందా…అయితే జాగ్రత్త..

దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. మొత్తం 7వేల 855 ఖాళీలను భర్తీ చేయనుంది. జూలైలో రిలీజ్ చేసిన నోటిఫికేషన్‌ను సవరించి ఐబీపీఎస్ తాజాగా మరో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం విదితమే. జూలైలో 5,830 క్లర్క్ పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. అయితే, ప్రాంతీయ భాషల్లో పరీక్షల నిర్వహణకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో నోటిఫికేషన్ ను సవరించి 7వేల 855 పోస్టులను భర్తీ చేస్తామని ఇటీవల ఐబీపీఎస్ ప్రకటించింది.

Sitting : ఎక్కువసేపు కూర్చునే ఉంటున్నారా..! గుండెజబ్బులు వచ్చే ఛాన్స్ అధికమే?

ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2021 అక్టోబర్ 7న ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు 2021 అక్టోబర్ 27 లోగా దరఖాస్తు చేయాలి. కాగా, జూలై 12 నుంచి 14 మధ్య దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ అప్లయ్ చేయాల్సిన అవసరం లేదు. వివరాలకు ibps.in ను సందర్శించండి.

* గుర్తింపు పొందిన యూనివర్సీటీ నుంచి ఏదైనా డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు.
* అభ్యర్థులు 20 ఏళ్లు పైబడి 28 ఏళ్ల లోపు ఉండాలి.
* అభ్యర్థులకు కంప్యూటర్ సిస్టమ్స్ ఆపరేట్ చేసే నైపుణ్యం ఉండాలి.
* కంప్యూటర్ ఆపరేషన్స్ లేదా లాంగ్వేజ్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ ఉండాలి.
* దీంతో పాటు అభ్యర్థులకు సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన అధికార భాషలో నైపుణ్యం ఉండాలి.
* ఆ భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం తెలిసి ఉండాలి.
* ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఇంగ్లీష్, హిందీ, తెలుగు.. తెలంగాణ అభ్యర్థులకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ భాషల్లో ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ రాయొచ్చు.

11 బ్యాంకుల్లో (బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, UCO బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్) ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు విధానం..
* ముందుగా అధికారిక వెబ్ సైట్ ( ibps.in.) వెళ్లండి.
* హోం పేజీలో కనిపించే IBPS Clerk Recruitment 2021 లింక్ పై క్లిక్ చేయాలి.
* రిజిస్ట్రేషన్ డిటైల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
* అప్లికేషన్ ఫార్మ్ నింపాలి. అవసరమైన డాక్యుమెంట్లు అప్ లోడ్ చేయాలి.
* అప్లికేషన్ ఫీజు పే చేసి పేజీ డౌన్ లోడ్ చేయాలి.
* తదుపరి అవసరాల కోసం హార్డ్ కాపీ ఉంచుకోవాలి.

* SC/ST/PWBD/EXSM కేటగిరీ అభ్యర్థులు రూ.175 ఫీజు చెల్లించాలి
* ఇతర కేటగిరీ అభ్యర్థులు రూ.850 చెల్లించాలి.
* ఫీజు ఆన్ లైన్ మోడ్ లోనే చెల్లించాలి.
* మరింత సమాచారం కోసం IBPS అధికారిక సైట్ ను చూడండి.