బ్రేకింగ్ : 6.1శాతానికి భారత జీడీపీ పడిపోతుందన్న IMF

  • Published By: venkaiahnaidu ,Published On : October 15, 2019 / 01:45 PM IST
బ్రేకింగ్ : 6.1శాతానికి భారత జీడీపీ పడిపోతుందన్న IMF

2019లో భారత జీడీపీ వృద్ధి అంచానను 6.1 శాతానికి తగ్గించింది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(IMF). ఏప్రిల్ అంచనాల కంటే ఇది 1.2 శాతం తక్కువ. 2018 లో భారతదేశ వాస్తవ వృద్ధి రేటు 6.8 శాతంగా ఉండగా అంతకంటే తక్కువగా ఈ ఏడాది వృద్ధి రేటు ఉండనుందని ఐఎమ్ఎఫ్ తెలిపింది. 2020లో భారత ఎకానమీ పుంజుకునే అవకాశముందని,వచ్చే ఏడాది 7.0శాతం వృద్ధి నమోదయ్యే అవకాశముందని ఐఎమ్ఎఫ్ అంచనా వేసింది. 

ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(IMF)తో యాన్యువల్ మీటింగ్ కు ముందే రెండు రోజుల క్రితం వరల్డ్ బ్యాంకు విడుదల చేసిన ఈ రిపోర్ట్ లో  భారత ఆర్థిక వృద్ధి వరుసగా రెండవ సంవత్సరం క్షీణించిందని తెలిపింది. 2019-20ఆర్థికసంవత్సరం భారత వృద్ధి రేటు 6శాతంకి పడిపోతుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.

ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతదేశం యొక్క జిడిపి వృద్ధి రేటు ఆరు సంవత్సరాల కనిష్టానికి 5% కి పడిపోయిన సమయంలో ప్రపంచ బ్యాంక్ అంచనాలు వచ్చాయి. అయితే ద్రవ్య విధానం సౌకర్యవంతంగా ఉంటే…దేశం క్రమంగా 2021 లో 6.9%, 2022 లో 7.2% కు కోలుకుంటుందని తెలిపింది. కరెంట్ అకౌంట్ లోటు 2.1 శాతానికి పెరిగిందని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది.