Corbevax: కోవిడ్ బూస్టర్ డోసుగా ‘కార్బెవాక్స్’.. కేంద్రం అనుమతి

కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ ఏదైనా రెండు డోసులు తీసుకున్న వారు ఇకపై ‘కార్బెవాక్స్’ను బూస్టర్ డోసుగా తీసుకోవచ్చు. దీనికి కేంద్రం తాజాగా అంగీకారం తెలిపింది. ముందు తీసుకున్న వ్యాక్సిన్లకు భిన్నమైన దానిని బూస్టర్ డోసుగా అనుమతించడం దేశంలో ఇదే మొదటిసారి.

Corbevax: కోవిడ్ బూస్టర్ డోసుగా ‘కార్బెవాక్స్’.. కేంద్రం అనుమతి

Corbevax: కోవిడ్ బూస్టర్ డోసుగా ‘కార్బెవాక్స్’ తీసుకునేందుకు కేంద్రం అనుమతించింది. ఇప్పటివరకు కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ ఏవైనా రెండు డోసులు తీసుకున్న వారు ఇకపై బూస్టర్ డోసుగా వాటికి బదులు ‘కార్బెవాక్స్’ కూడా తీసుకోవచ్చు. ఇలా ముందు తీసుకున్న వ్యాక్సిన్లకు భిన్నమైన వ్యాక్సిన్‌ను బూస్టర్ డోసుగా అనుమతించడం దేశంలో ఇదే మొదటిసారి.

Rajasthan: 70 ఏళ్ల వయసులో తల్లైన మహిళ.. పెళ్లైన 54 ఏళ్లకు తల్లిదండ్రులుగా మారిన జంట

కేంద్ర తాజా మార్గదర్శకాల ప్రకారం.. 18 ఏళ్లు దాటిన వారు ఎవరైనా ‘కార్బెవాక్స్’ను బూస్టర్ డోసుగా తీసుకోవచ్చు. ఇమ్యునైజేషన్‌పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్‌టాగీ) ప్రతిపాదన మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. రెండో వ్యాక్సిన్ తీసుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకునేందుకు అనుమతి ఉంది. తాజా నిర్ణయానికి సంబంధించి ‘కోవిన్’ పోర్టల్‌లో మార్పులు కూడా చేయబోతున్నారు. ఈ వ్యాక్సిన్‌ను హైదరాబాద్ కంపెనీ అయిన ‘బయోలాజికల్ ఈ’ అనే సంస్థ రూపొందించింది. ఆర్‌బీడీ ప్రొటీన్ ఆధారంగా దేశంలో రూపొందించిన తొలి టీకా ఇదే. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్‌ను 12-14 ఏళ్ల వయసు కలిగిన చిన్నారులకు ఇస్తున్నారు.

TTD: తిరుమలలో పెరిగిన రద్దీ.. భక్తులకు టీటీడీ ప్రత్యేక సూచన

అయితే, 18 సంవత్సరాలు దాటిన వారికి బూస్టర్ డోసుగా ఇచ్చేలా ప్రయోగాలు నిర్వహించి, విజయం సాధించింది. దీనికి సంబంధించిన ఫలితాల్ని పరిశీలించిన ప్రభుత్వ కమిటీ.. ఈ వ్యాక్సిన్‌కు ఆమోదముద్ర వేసింది. దీంతో బూస్టర్ డోసుగా ఇచ్చేందుకు కేంద్రం అనుమతించింది. తమ ఔషధానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో సంస్థ ఎమ్‌డీ మహిమా దల్తా హర్షం వ్యక్తం చేశారు.