కరోనా కేసుల్లో తన వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన భారత్, 24గంటల్లో 86వేల కేసులు, 40లక్షలు దాటిన బాధితులు

  • Published By: naveen ,Published On : September 5, 2020 / 11:03 AM IST
కరోనా కేసుల్లో తన వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన భారత్, 24గంటల్లో 86వేల కేసులు, 40లక్షలు దాటిన బాధితులు

భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకీ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఒకే రోజులో అత్యధిక కేసులు నమోదైన దేశంగా భారత్ తన రికార్డును తానే బ్రేక్ చేసింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10లక్షల 59వేల 346 పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 86వేల 432 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. దీంతో భారత్ లో మొత్తం కేసుల సంఖ్య 40లక్షల 23వేల 179కి చేరింది.



వీరిలో 8లక్షల 46వేల 395 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 31లక్షల 07వేల 223 మంది కోలుకున్నారు. కొత్తగా 1,089 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 69వేల 561కి పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా రికవరీ రేటు 77.23 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.73 శాతంగా ఉంది.
https://10tv.in/cdc-defends-controversial-new-guidance-for-coronavirus-testing/
ఢిల్లీలో మళ్లీ పెరుగుతున్న కేసులు:
అయితే, దేశం మొత్తం మీద క్రియాశీలక(యాక్టివ్) కేసుల సంఖ్య 15,271 మేర పెరిగింది. నిన్నటితో పోలిస్తే ఇది తగ్గడం గమనార్హం. అత్యధికంగా మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 19వేల 218 కేసులు నమోదయ్యాయి. క్రియాశీలక కేసుల పెరుగుదలలోనూ మహారాష్ట్రదే తొలిస్థానం. ఇక దేశరాజధాని ఢిల్లీలో కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. శుక్రవారం 2వేల 194 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. గత 69 రోజుల్లో ఇవే అత్యధిక కేసులు.



అత్యధిక కేసులు, 70శాతం మరణాలు ఈ 5 రాష్ట్రాల్లోనే:
ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4కోట్ల 77లక్షల 38వేల 491 కరోన నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) వెల్లడించింది. గత 24 గంటల వ్యవధిలో నమోదైన మొత్తం కేసుల్లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌దే సింహభాగం. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో ఉన్న క్రియాశీలక కేసుల్లో 62 శాతం ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఉండడం గమనార్హం. అలాగే ఇప్పటి వరకు సంభవించిన మరణాల్లోనూ 70 శాతం ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయి.

రోజురోజుకి రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. దేశంలో వరుసగా 4వ రోజు 70వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా, కరోనా పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు.