India Covid-19 : భారత్‌లో కరోనా విజృంభణ.. పెరుగుతున్న కొత్త కేసులు, మరణాలు

India Covid-19 : భారత్‌లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. తగ్గినట్టే తగ్గి కరోనా మళ్లీ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజురోజుకీ కరోనా కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.

India Covid-19 : భారత్‌లో కరోనా విజృంభణ.. పెరుగుతున్న కొత్త కేసులు, మరణాలు

India Covid 19 India Reports 2,927 New Covid 19 Cases In 24 Hours

India Covid-19 : భారత్‌లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. తగ్గినట్టే తగ్గి కరోనా మళ్లీ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజురోజుకీ కరోనా కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,927 కరోనా కేసులు నమోదు కాగా, 32 మరణాలు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం 16,279 కరోనా యాక్టీవ్ కేసులు (0.04 శాతం) ఉండగా, కరోనా మరణాలు 5,23,654 మరణాలు నమోదయ్యాయి.

దేశంలో ఇప్పటివరకు 4,30,65,496 కరోనా కేసులు నమోదు కాగా.. 5,23,654 మరణాలు నమోదుయ్యాయి. కరోనా నుంచి కోలుకున్నవారిలో రికవరీ రేటు 98.75 శాతంగా నమోదైంది. మంగళవారం ఒక్కరోజునే కరోనా నుంచి 2252 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 4,25,25,563 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. భారత్‌లో 467 రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 188.19 కోట్ల డోసుల టీకాలను అందించారు. మంగళవారం 21,97,082 డోసుల టీకాలు అందించారు.

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 188,19,40,971 డోసుల టీకాలను అందించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్‌లో కరోన నిర్ధారణ పరీక్షలు 83.59 కోట్లు దాటాయి. గడిచిన 24 గంటల్లో 5,05,065 టెస్టులను నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 83,59,74,079 టెస్టులను నిర్వహించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Read Also : Telangana Latest Covid Report : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే..