new corona strain : ఇండియా అలర్ట్..నిర్ణయంపై ఉత్కంఠ

new corona strain : ఇండియా అలర్ట్..నిర్ణయంపై ఉత్కంఠ

India put on alert over new Covid strain : యూకేలో కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ (corona strain) విజృంభిస్తుండటంతో.. భారత ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జాగ్రత్త చర్యలపై చర్చించేందుకు కొవిడ్‌-19 జాయింట్ మానిటరింగ్‌ గ్రూప్‌ అత్యవసర సమావేశానికి పిలిచింది ఆరోగ్యశాఖ. హెల్త్‌ డిపార్ట్‌మెంట్ డీజీ అధ్యక్షతన ఈ భేటీ కానుంది. కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ గురించి ఈ సమావేశంలో ఎక్కువగా చర్చించనున్నారు. ఈ మానిటరింగ్ గ్రూప్‌లో డబ్ల్యూహెచ్‌వో (WHO) భారత ప్రతినిధి రోడరికో ఓఫ్రిన్‌ కూడా ఉన్నారు. ఆయన కూడా సమావేశానికి హాజరవుతారు. దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో కరోనా కొత్త వేరియంట్.. కలవర పెడుతోంది. జనవరి నుంచి వాక్సినేషన్ ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న సమయంలో… యూకే పరిణామాలు కేంద్రాన్ని కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. కాసేపట్లో జరిగే అత్యవసర సమావేశంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.

డేంజర్ బెల్స్ : –
కరోనాకు వ్యాక్సిన్ వచ్చేసిందని అందరూ ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో.. కరోనా వైరస్ కొత్త వేరియంట్ డేంజర్ బెల్స్ మెగిస్తోంది. బ్రిటన్‌ (Britain) సహా దక్షిణాఫ్రికా (South Africa) దేశాలను కొత్త రకం కరోనా వైరస్‌ స్ట్రెయిన్‌ వణికిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే బ్రిటన్‌, దక్షిణాఫ్రికా దేశాల నుంచి వచ్చే విమానాలపై నెదర్లాండ్‌, బెల్జియం (Netherlands, Belgium) దేశాలు నిషేధం విధించాయి. ఆ దిశగానే ఆలోచన చేస్తోంది జర్మనీ (Germany). రెండు దేశాల నుంచి వచ్చే ప్యాసింజర్‌ విమానాలపై నిషేధాజ్ఞలు విధించేందుకు రెడీ అవుతోంది. సౌదీ అరేబియా సరిహద్దులను మూసేసింది.

బ్రిటన్‌లో వేగంగా విస్తరిస్తున్న వైరస్ : –
బ్రిటన్‌లో కరోనా వైరస్ రూపాంతరం చెందింది. ఇది మరింత వేగంగా వ్యాపిస్తోంది. బ్రిటన్‌తో పాటూ… దక్షిణాఫ్రికాకి పాకింది. జపాన్‌లో కూడా వచ్చిందనే అనుమానాలు వస్తున్నాయి.. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. బ్రిటన్‌ లాంటి పరిస్థితులు రాకుండా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నాయి. బ్రిటన్‌లో వైరస్‌ కంట్రోల్‌లో ఉందనుకున్న సమయంలో కరోనా రూపంతర వైరస్‌ ఒక్కసారిగా పాత రోజులను గుర్తు చేసింది. అక్కడి పరిస్థితి 8నెలల వెనక్కి వెళ్లిపోయింది. దేశమంతా అవుట్ ఆఫ్‌ కంట్రల్‌ అయిపోయింది.
బ్రిటన్‌లో కొత్త రకం వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. దీంతో అక్కడ మరోసారి కఠిన లాక్‌డౌన్ విధించారు. ఇది క్రిస్మస్ వేడుకలపై తీవ్ర ప్రభావం చూపనుంది. క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన ప్లాన్స్ అన్నింటినీ మార్చుకోవాల్సిందిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రజలను రిక్వెస్ట్ చేశారు.

వారం రోజులుగా కేసులు : –
ఈసారి క్రిస్మస్‌ (Christmas)ను ప్రణాళిక ప్రకారం నిర్వహించుకునే అవకాశాలు లేకపోవం చాలా బాధగా ఉందన్నారాయన. కొత్తరకం కరోనా వైరస్‌ ఒకరి నుంచి ఒకరికి సులభంగా వ్యాపిస్తోందని.. ఈ వైరస్‌ 70 శాతం ఎక్కువ వేగంగా ఇది వ్యాప్తి చెందుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజులుగా నమోదైన కేసుల్లో 60 శాతం కంటే ఎక్కువే కొత్తరకం వైరస్‌ను గుర్తించినట్లు బ్రిటన్‌ వైద్యాధికారులు చెప్పారు. వ్యాక్సిన్‌ పంపిణీకి ప్రపంచమంతా రెడీ అవుతున్న వేళ బ్రిటన్‌ నుంచి భయంకరమైన విషయం బయటకొచ్చింది. యూకేలో కరోనా వైరస్ మ్యుటేటెడ్ వేరియెంట్‌ను గుర్తించడంతో యావత్‌ ప్రపంచం కలవరపాటుకు గురైంది.

టైర్ – 4 ఆంక్షలు : –
దీని కారణంగా… కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. అంతేకాదు దాన్ని కంట్రోల్ చేయడం కూడా యూకే ప్రభుత్వం వల్ల కావడం లేదు. దీంతో అక్కడ ఎప్పుడూ విధంగా లేని చాలా ప్రాంతాల్లో ఆంక్షాలను పెట్టింది ప్రభుత్వం. మరోవైపు బ్రిటన్‌తో పాటు దక్షిణాఫ్రికాలో కూడా కొత్త కరోనా స్ట్రెయిన్‌ను గుర్తించారు. ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న కరోనా రెండో వేవ్‌కి ఈ కొత్త స్ట్రెయిన్ కారణమని తెలుస్తోంది.

కరోనా కొత్తరూపం : –
కరోనా వ్యాక్సినేషన్‌ చాలా దేశాల్లో స్టార్ట్ అయిపోయింది. మరికొన్ని దేశాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. అంతా ఒకే అనుకుంటున్న సమయంలో కరోనా కొత్త రూపం ప్రపంచదేశాలతో పాటు.. వ్యాక్సిన్‌ తయారిదారులను కూడా ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఇప్పటికవరకు ఉన్న వ్యాక్సిన్లు కరోనా వేరియెంట్‌ను ప్రివెంట్‌ చేయగలదా లేదో స్పష్టంగా తెలియదు. కొత్త వేరియంట్ వైరస్ పరిణామంలో అనేక జన్యుమార్పిడిలు జరుగుతాయి.

జన్యుమార్పిడిలు : –
ఈ జన్యుమార్పిడులలో కొన్ని బాగా ప్రభావవంతమైనవి వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త వేరియంట్‌లో దాదాపుగా 17 వరకు జన్యుమార్పిడిలు ఉన్నాయని శాస్త్రవెత్తలు ఇప్పటికే గుర్తించారు. అయితే ఈ వేరియంట్ కారణంగా వ్యాక్సిన్ పనికిరాకుండా పోయే అవకాశం ఉన్నట్లుగా ఎలాంటి ఆధారం లేదు. దీనిమీద పరిశోధనలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా కాని 2021 కోసం ప్రపంచమంతా ఎంతో పాజిటివ్‌గా ఎదురుచుస్తోన్న వెళ కరోనా కొత్త రకం సీన్‌ను పూర్తిగా మార్చిపడేసింది.