IND vs ZIM ODIs: జింబాబ్వే టూర్‌లో వన్డే జట్టుకు సారథిగా ధావన్.. రోహిత్, కోహ్లీకి విశ్రాంతి..

జింబాబ్వే‌ జట్టుతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు భారత్ జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. వన్డే సిరీస్ కు జట్టు పగ్గాలను శిఖర్ ధావన్ కు అప్పగించారు. భారత్ జట్టు 2016 తర్వాత తొలిసారి జింబాబ్వేలో పర్యటించనుంది.

IND vs ZIM ODIs: జింబాబ్వే టూర్‌లో వన్డే జట్టుకు సారథిగా ధావన్.. రోహిత్, కోహ్లీకి విశ్రాంతి..

Dhavan

IND vs ZIM ODIs: జింబాబ్వే‌ జట్టుతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు భారత్ జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. వన్డే సిరీస్ కు జట్టు పగ్గాలను శిఖర్ ధావన్ కు అప్పగించారు. భారత్ జట్టు 2016 తర్వాత తొలిసారి జింబాబ్వేలో పర్యటించనుంది. ఆగస్టు 18, 20, 22 తేదీల్లో హరారేలో ఇరు జట్ల మధ్య వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి.

Virat Kohli: కోహ్లీ ఒక్క 20నిమిషాలు టైమిస్తే సాయం చేస్తా – గవాస్కర్

జింబాబ్వే వెళ్లే జట్టులో కీలక ప్లేయర్లకు చోటు దక్కలేదు. రోహిత్ శర్మ, కోహ్లీతో పాటు రిషిబ్ పంత్, బ్రూమా, హార్ధిక్ పాండ్యాలకు విశ్రాంతినిచ్చారు. ఈ సిరీస్ లో టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీకి అవకాశం లభిస్తుందని అందరూ భావించారు. కానీ జింబాబ్వే వన్డే సిరీస్ కు కూడా జట్టులో ఆడే అవకాశం కోహ్లీకి లభించలేదు. ఇంగ్లండ్ జట్టులో జరిగిన మ్యాచ్ లలో ప్రతిభ కనబర్చలేకపోవటంతో వెస్టిండీస్ పర్యటనకు కోహ్లీకి విశ్రాంతి ఇచ్చారు. ప్రస్తుతం జింబాబ్వే టూర్ కు సైతం కోహ్లీకి విశ్రాంతి ఇవ్వడం గమనార్హం.

జింబాబ్వే వన్డేలకు భారత జట్టు :
శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్ (WK), సంజు శాంసన్ (WK), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్  పటేల్, అవేశ్ ఖాన్ , ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్.