Road Accidents : రోడ్డుప్రమాద మృతుల్లో అగ్రస్థానంలో భారత్ : నితిన్ గడ్కరీ

Road Accidents : భారత్‌లో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రపంచంలో రోడ్డుప్రమాదాలు ఎక్కువగా జరిగే దేశాల్లో భారత్ టాప్‌లో ఉందన్నారు.

Road Accidents : రోడ్డుప్రమాద మృతుల్లో అగ్రస్థానంలో భారత్ : నితిన్ గడ్కరీ

India Tops World In Terms Of Number Of People Killed In Road Accidents

Road Accidents : భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రపంచంలో రోడ్డుప్రమాదాలు ఎక్కువగా జరిగే దేశాల్లో భారత్ టాప్ లో ఉందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. జెనీవాలోని అంతర్జాతీయ రోడ్డు సమాఖ్య విడుదల చేసిన (వరల్డ్ రోడ్ స్టాటిస్టిక్స్ (WRS) 2018) గణాంకాల ప్రకారం.. రోడ్డు ప్రమాదాలు, గాయపడుతున్నవారి సంఖ్యలో భారత్ 3వ స్థానంలో ఉందని ఆయన రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో గడ్కరీ తెలిపారు.

2020లో జరిగిన ప్రమాదాల్లో చనిపోయిన వారిలో 18 నుంచి 45 ఏళ్ల లోపువారే 70శాతం ఉన్నట్లు గడ్కరీ తెలిపారు. ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ.. మొత్తం 22 గ్రీన్‌ఫీల్డ్ హైవేలు (రూ. 1,63,350 కోట్లతో 2,485 కి.మీ పొడవుతో 5 ఎక్స్‌ప్రెస్‌వేలు ఉన్నాయని చెప్పారు. రూ. 1,92,876 కోట్లతో 5,816 కి.మీ పొడవుతో 17 యాక్సెస్ కంట్రోల్డ్ హైవేలు) ఉన్నాయని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భారత్‌ పరియోజన తొలి దశ కింద ఆంధ్రప్రదేశ్‌లో ఐదు గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ ప్రాజెక్ట్‌లు చేపట్టామన్నారు.

ఈ ఐదు ప్రాజెక్ట్‌లు 2026-27 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇంకా 22 గ్రీన్ ఫీల్డ్ రహదారుల నిర్మాణం జరుగుతున్నట్లు గడ్కరీ ప్రకటించారు. వాహనాల రిజిస్ట్రేషన్‌, ఛాసిస్‌ నెంబర్‌ ఆధారంగా వాహనాలకు ఫాస్టాగ్‌ జారీ చేసినట్టు వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులు రూ.4.95 కోట్లకు పైగా ఫాస్టాగ్‌లను జారీ చేశాయని తెలిపారు. టోల్‌ ప్లాజాల వద్ద ఫాస్టాగ్‌ల ప్రవేశం 96.5 శతానికి చేరినట్టు వివరించారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ వేలోని 3 విభాగాలు అంటే.. ఢిల్లీ దౌసా-లాల్‌సోట్ (జైపూర్) (214 కి.మీ), వడోదర అంకేలేశ్వర్ (100 కి.మీ), కోటా రత్లం ఝబువా (245 కి.మీ) మార్చి 23 నాటికి పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.

మరో ప్రశ్నకు సమాధానంగా.. వాహనం రిజిస్ట్రేషన్ నంబర్/ఛాసిస్ నంబర్ ఆధారంగా వాహన వినియోగదారులకు ఫాస్ట్‌ట్యాగ్ జారీ చేయనున్నట్టు మంత్రి చెప్పారు. మార్చి 30, 2022 నాటికి, వివిధ బ్యాంకులు జారీ చేసిన మొత్తం ఫాస్ట్‌ట్యాగ్‌ల సంఖ్య 4,95,20,949 చేరుతాయని, జాతీయ రహదారులపై ఉన్న ఫీజు ప్లాజాల వద్ద ఫాస్ట్‌ట్యాగ్ ప్రవేశం దాదాపు 96.5 శాతంగా ఉందని గడ్కరీ చెప్పారు.

Read Also : రోడ్డు ప్రమాద మృతుల్లో టాప్‌లో ఇండియా