భారత్ క్షిపణి పరీక్ష విజయవంతం.. 30కి.మీ దూరంలో విమానాన్ని కూల్చగలదు!

  • Published By: sreehari ,Published On : November 13, 2020 / 07:23 PM IST
భారత్ క్షిపణి పరీక్ష విజయవంతం.. 30కి.మీ దూరంలో విమానాన్ని కూల్చగలదు!

missile shoot plane 30 km away : ఆల్-వెదర్ క్విక్ రియాక్షన్ సర్ఫేస్-టు-ఎయిర్ క్షిపణులను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణలు అన్ని వాతావరణాల్లోనూ తట్టుకోగలవు. ఉపరితలం నుంచే కాదు.. ఆకాశంలోనూ ప్రయోగించగల క్షిపణులను తొలి రౌండ్‌లో భారత్ విజయవంతగా పరీక్షించింది.



ఈ క్షిపణి 30 కిలోమీటర్ల రేంజ్ లక్ష్యాన్ని చేధింగలదు. గత కొన్ని ఏళ్లుగా క్షిపణలకు సంబంధించి భారత్ నిరంతరాయంగా పరీక్షలు కొనసాగిస్తూనే ఉంది.


చండీపూర్ వద్ద ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) వద్ద ఉన్న మొబైల్ లాంచర్ నుంచి మధ్యాహ్నం 3.40 గంటలకు అధునాతన క్షిపణిని పరీక్షించారు.



అనుకున్న లక్ష్యాన్ని ఈ క్షిపణి విజయవంతంగా నాశనం చేసింది. ఆకాశంలో 15 కిలోమీటర్ల వైమానిక లక్ష్యాన్ని తాకగల ఈ క్షిపణి మొబైల్ ఆధారిత రెండు వాహనాల వ్యవస్థ నుంచి ప్రయోగించారు.

తదుపరి దశలో స్వల్ప రేంజ్ క్షిపణిని ఆర్మీ, వైమానిక దళం పరీక్షించనుంది. ఉత్పత్తిలోకి వెళ్లేముందు ఈ క్షిపణిని పరీక్షించనున్నాయి