Israel Drones : భారత ఆర్మీ చేతికి అధునాతన ఇజ్రాయెల్‌ డ్రోన్లు..LAC వద్ద మొహరింపు

అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వద్ద, వాస్తవ నియంత్రణ రేఖ (LAC)వెంబడి చైనా కార్యకలాపాలపై నిఘా ఉంచేందుకు..తాజాగా ఇజ్రాయెలీ డ్రోన్ల రాకతో భార‌త ఆర్మీ నిఘా సామ‌ర్థ్యాల‌కు మ‌రింత బూస్ట్

Israel Drones : భారత ఆర్మీ చేతికి అధునాతన ఇజ్రాయెల్‌ డ్రోన్లు..LAC వద్ద మొహరింపు

Drones (1)

Israel Drones అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు వద్ద, వాస్తవ నియంత్రణ రేఖ (LAC)వెంబడి చైనా కార్యకలాపాలపై నిఘా ఉంచేందుకు..తాజాగా ఇజ్రాయెలీ డ్రోన్ల రాకతో భార‌త ఆర్మీ నిఘా సామ‌ర్థ్యాల‌కు మ‌రింత బూస్ట్ ల‌భించింది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా కొన్ని నెల‌ల‌పాటు ఆల‌స్య‌మైన ఇజ్రాయెల్‌కు చెందిన అధునాత‌న‌ హెరాన్ డ్రోన్స్ ఎట్ట‌కేల‌కు భార‌త్‌కు చేరుకున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆయుధాల సేకరణ నిబంధన క్రింద ఈ డ్రోన్లను భారత్ కొనుగోలు చేసింది.

ఇజ్రాయెల్ నుంచి తాజాగా భారత్ కు చేరుకున్న అడ్వాన్స్‌డ్ హెరోన్ డ్రోన్లను తూర్పు లడఖ్ సెక్టార్ లో మోహరిస్తున్నట్లు అత్యున్నత స్థాయి ప్రభుత్వ అధికారి తెలిపారు. మన దేశంలో ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న హెరాన్ డ్రోన్స్ కంటే ఈ డ్రోన్స్ మరింత అడ్వాన్స్‌డ్ ఫీచ‌ర్స్ క‌లిగి ఉన్నాయ‌ని చెప్పారు. కొత్తగా వచ్చిన డ్రోన్లకుగల యాంటీ జామింగ్ సామర్థ్యం అంతకుముందు డ్రోన్ల కన్నా చాలా మెరుగ్గా ఉన్నట్లు తెలిపారు.

కాగా, చైనాతో సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం ఉండటంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం సాయుధ దళాలకు ప్రత్యేక ఆర్థిక అధికారాలు కల్పించింది. యుద్ధ సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం రూ.500 కోట్ల విలువైన పరికరాలు, వ్యవస్థలను కొనుగోలు చేయడానికి రక్షణ దళాలకు అధికారం ఇచ్చింది. ఈ అధికారాన్ని వినియోగించి ఈ డ్రోన్లను కొనుగోలు చేశారు. మరోవైపు భారతీయ స్టార్టప్ కంపెనీల నుంచి కొన్ని మినీ డ్రోన్లను రక్షణ దళాలు కొంటున్న విషయం తెలిసిందే.

ALSO READ New Navy Chief : నేవీ కొత్త చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన హరి కుమార్