Indian Soldiers : చైనా బోర్డర్ లోని సైనికులకు అత్యాధునిక ఆయుధాలు

12వ విడత సైనిక చర్చల తర్వాత తూర్పు లడఖ్‌లోని గోగ్రా పోస్ట్‌ నుంచి చైనా-భారత బలగాలు వెనక్కి తగ్గినప్పటికీ డ్రాగన్ దేశం ఎప్పుడు ఏ కొర్రీ పెట్టినా ధీటుగా స్పందించే ఏర్పాట్లను కేంద్రం చేస్తోంది.

Indian Soldiers : చైనా బోర్డర్ లోని సైనికులకు అత్యాధునిక ఆయుధాలు

Border2 (2)

Indian Soldiers 12వ విడత సైనిక చర్చల తర్వాత తూర్పు లడఖ్‌లోని గోగ్రా పోస్ట్‌ నుంచి చైనా-భారత బలగాలు వెనక్కి తగ్గినప్పటికీ డ్రాగన్ దేశం ఎప్పుడు ఏ కొర్రీ పెట్టినా ధీటుగా స్పందించే ఏర్పాట్లను కేంద్రం చేస్తోంది. ఇందులో భాగంగానే చైనాతో సరిహద్దుల వద్ద గస్తీ కాస్తున్న భారత బలగాలకు కేంద్రం అత్యంత ఆధునిక ఆయుధాలను సమకూర్చింది. అమెరికన్ సిగ్ సావర్‌ 716 అసాల్ట్ రైఫిళ్లు, స్విస్‌ ఎంపీ-9 పిస్తోళ్లను సైన్యానికి అందించారు. వాస్తవాధీన రేఖ(LAC)వెంబడి న్యోమా వద్ద గస్తీ కాస్తున్నబలగాలకు ఈ ఆయుధాలు అందించినట్లు భారత సైన్యం తెలిపింది.

మరోవైపు,శీతాకాలంలో లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి ఉష్ణోగ్రతలు మైనస్‌ 35 నుంచి 40 డిగ్రీల వరకూ పడిపోతున్న నేపథ్యంలో సైనిక బలగాలు ఉండేందుకు అత్యంత వేగంగా నిర్మించే ఫాస్ట్ ఎరెక్టబుల్‌ మాడ్యులార్ షెల్టర్లను కేంద్రం సమకూర్చింది. ఫార్వర్డ్‌ ఏరియాల్లో కాపాలా కాసే సైనికులకు ఇవి ఎంతగానో ఉపకరిస్తున్నాయి. చాలా వేగంగా నిర్మించే సౌలభ్యమున్న ఈ షెల్టర్లలో 8 నుంచి 40 మంది వరకు సైనికులు ఉండవచ్చు. అవసరాన్ని బట్టి వీటిని ఎక్కడి నుంచి ఎక్కడికైనా తరలించుకునే అవకాశముంది.

READ India-China Disengage In Gogra : భారత్ పట్టుతో వెనక్కి తగ్గిన చైనా..గోగ్రాలో దళాల ఉపసంహరణ