Indian Edtech : ఉద్యోగులు ఆఫీస్ నుంచి బయటకెళ్లకుండా తాళం వేయించిన సంస్థ..

సార్ పర్మిషన్ ఉంటేనే బయటకు వెళ్లనిస్తాం లేదంటే లేదు అంటూ ఆ సంస్థ సెక్యురిటీ గార్డు తాళాలు వేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘనకార్యం చేసింది ఏదో అనామకమైన సంస్థ కాదు. ఇండియన్ ఎడ్ టెక్ స్టార్టప్ సంస్థ కోడింగ్ నింజాస్ కంపెనీ..దీంతో విమర్శలు వెల్లువెత్తాయి.

Indian Edtech : ఉద్యోగులు ఆఫీస్ నుంచి బయటకెళ్లకుండా తాళం వేయించిన సంస్థ..

Indian Edtech locking employees at office

Indian Edtech : ఉద్యోగులు ఆఫీసు నుంచి బయటకు వెళ్లకుండా తాళాలు వేసింది ఓ సంస్థ. సార్ పర్మిషన్ ఉంటేనే బయటకు వెళ్లనిస్తాం లేదంటే లేదు అంటూ ఆ సంస్థ సెక్యురిటీ గార్డు తాళాలు వేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘనకార్యం చేసింది ఏదో అనామకమైన సంస్థ కాదు. ఇండియన్ ఎడ్ టెక్ స్టార్టప్ సంస్థ కోడింగ్ నింజాస్ కంపెనీ..గురుగ్రామ్ లోని సదరు సంస్థ ఉద్యోగులను బయటకు వెళ్లకుండా కార్యాలయానికి తాళాలు వేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఇది పొరపాటున జరిగింది అంటూ క్షమాపణ చెప్పింది. లింక్డిన్, ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియాలో సెక్యురిటీ గార్డు ఎంట్రన్స్ గేటుకు తాళాలు వేస్తున్న ఫోటోలు వైరల్ గా మారాయి.

 

ఓ ఉద్యోగి తాళాలు వేసి బయటకు వెళ్లనీయకపోవటంపై సదరు సెక్యురిటీ గార్డును ప్రశ్నించటంతో మేనేజన్ సార్ పర్మిషన్ లేకుండా ఎవ్వరిని బయటకు వెళ్లనివ్వవద్దని చెప్పారని తెలిపాడు. ఎవరైనా బయటకు వెళ్లాలంటే మేనేజర్ సార్ పర్మిషన్ ఉండాల్సిందేనని సదరు సెక్యూరిటీ గార్డ్ చెప్పినట్లుగా ఆ వీడియోలో ఉంది. మేనేజర్  ఆదేశాలతో ఇలా తాళం వేసినట్లుగా తెలుస్తోంది. ఎడ్ టెక్ వ్యవస్థాపకులు రవి హండా దృష్టికి ఈ విషయం రావటంతో నేరుగా వాచ్ మెన్ తో మాట్లాడారు. దీంతో మనేజన్ సార్ ఇలా చెప్పారని అందుకే తాను తాళం వేశానని చెప్పాడు.దీంతో ఉద్యోగులకు క్షమాపణ చెప్పి..ఈ పిచ్చిపనికి పాల్పడ్డ సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 

దీనిపై విమర్శలు రావడంతో కోడింగ్ నింజాస్ కూడా స్పందించింది. వరుసగా ట్వీట్లు చేసింది. తమ నాలుగు ఆఫీసుల్లో ఒక ఆఫీసులో ఇలా జరిగిందని ఒక ఉద్యోగి చేసిన పిచ్చి పని వల్ల ఇలా చేయాల్సి వచ్చింని వివరణ ఇచ్చింది. కానీ ఈ విషయం తమ దృష్టికి వచ్చాక వెంటనే సరిదిద్దామని తెలిపింది. ఎవరి ఇలా చేయాల్సి వచ్చిందో అదే ఉద్యోగి తన చేసింది పొరపాటు అని గ్రహించి క్షమాపణ చెప్పాడని తెలిపింది.

ఇలా ఆఫీసు గేటుకు తాళాలు వేసి ఉద్యోగులకు అసౌకర్యం కల్పించినందుకు సంస్థ విచారం వ్యక్తం చేసింది. ఇలాంటిది మరోసారి జరగదని ఉద్యోగులకు వివరణ ఇచ్చింది. అలాగే ఈ చర్య తీసుకోవటానికి కారణమైన సదరు ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని తెలిపింది. ఇది ఉద్దేశ్యపూర్వకంగా జరిగింది కాదని..ఇది తమ విలువలకు వ్యతిరేకమని కోడింగ్ నింజాస్ తెలిపింది. ఇబ్బందిపడిన ఉద్యోగులందరికీ క్షమాపణలు చెప్పింది. కాగా కోడింగ్ నింజాస్ సంస్థను 2016లో స్థాపించారు. సంస్థ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఈ ఎడ్ టెక్ సంస్థ మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఆండ్రాయిడ్ తదితర 17 ప్రోగ్రామింగ్ అండ్ డెవలప్ మెంట్ కోర్సులను నిర్వహిస్తోంది. ఈ కంపెనీలో 150 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా..ఈ వీడియోను లింక్డ్‌ఇన్‌లో యూనిక్ ఇంప్రింట్స్ సహ వ్యవస్థాపకుడు హిమాన్షు అటల్ షేర్ చేసారు.”కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగుల దోపిడీ, పని వాతావరణాన్ని దిగజార్చడం ఒక కొత్త ట్రెండ్” అని అటల్ పోస్ట్ పేర్కొన్నారు.