Railway Jobs: కొవిడ్‌తో చనిపోయిన 3వేల మంది కుటుంబాలకు రైల్వే ఉద్యోగాలు

ఇండియన్ రైల్వేస్ కొవిడ్ తో నష్టపోయిన కుటంబాలను ఆదుకునే నిర్ణయం తీసుకుంది. 2వేల 800మందికి పైగా రైల్వే ఉద్యోగులు కొవిడ్ తో చనిపోయారు.

Railway Jobs: కొవిడ్‌తో చనిపోయిన 3వేల మంది కుటుంబాలకు రైల్వే ఉద్యోగాలు

Railway Jobs

Railway Jobs: ఇండియన్ రైల్వేస్ కొవిడ్ తో నష్టపోయిన కుటంబాలను ఆదుకునే నిర్ణయం తీసుకుంది. 2వేల 800మందికి పైగా రైల్వే ఉద్యోగులు కొవిడ్ తో చనిపోయారు. వీరంతా రైల్వే డ్యూటీల్లో ఉండి సర్వీస్ చేస్తూనే ప్రాణాలు విడిచారు. మార్చి 2020 నుంచి చూస్తే రైల్వే అధికారులతో కలిపి 3వేల 256మంది పలు ర్యాంకుల్లో, డిపార్ట్‌మెంట్లలో చనిపోగా ఆ కుటుంబాలు అనాథలైపోయాయి.

ముంబైలోని సెంట్రల్ రైల్వే, వెస్టరన్ రైల్వేలలో గరిష్ఠంగా 743మంది చనిపోయారు. వారి కుటుంబాలకు అక్టోబరు నెలాఖరులోగా నష్టపరిహారం అందజేయనుంది రైల్వే. వారిలో 87శాతం మందికి నష్టపరిహారం కింద నాలుగు నెలల్లోగా కొలువుల్లోకి తీసుకుంటామని రైల్వే చెప్పింది. చనిపోయిన వారి భార్యలు, లేదా కొడుకులు ఎవరి దగ్గరి నుంచైతే ఎంప్లాయ్మెంట్ రిక్వెస్ట్ వస్తుందో వారందరనీ పరిగణనలోకి తీసుకోనుంది.

ఒకవేళ వారు ఉన్నత విద్యలు పూర్తి చేయాల్సి ఉంటే ఆ తర్వాతే ఉద్యోగాల్లో చేరొచ్చు కూడా. కాకపోతే వీటిలో చాలా మంది గ్రూప్ డీ కేటగిరీకి చెందిన వారే ఉండటం గమనార్హం.

……………………………………… : ఆర్యన్ ఖాన్ కు జైలా ? బెయిలా ?

కొద్ది రోజుల ముందు అనౌన్స్ చేసిన బోనస్ ప్రకారం.. 78రోజుల వేతనానికి సరిపోతుందని రైల్వే నిర్ధారించింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 11.56లక్షల నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు లబ్ధి చేకూరనుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. దీని కోసం వెయ్యి 985కోట్లు అవసరమవుతుందని వెల్లడించారు.