India Covid-19, రికవరీ శాతం పెరుగుతోంది – హెల్త్ మినిస్ట్రీ

India Covid-19, రికవరీ శాతం పెరుగుతోంది – హెల్త్ మినిస్ట్రీ

India’s active Covid-19 case : భారతదేశంలో కొవిడ్ -19 (Covid – 19) వైరస్‌తో బాధ పడుతూ కోలుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని హెల్త్ మినిస్ట్రీ (Health Ministry) వెల్లడించింది. రోజువారీ తక్కువగా కేసులు రికార్డువుతున్నట్లు, వైరస్‌ వ్యాప్తి క్షీణించిందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం 2,81,667 వద్ద ఉందని, 2.77 శాంత యాక్టివ్ కేసులు (active case) గా ఉన్నాయని వెల్లడించింది. మొత్తం 97.5 లక్షలు (97 లక్షల 40 వేల 108) రికవరీ కేసులు చేరుకున్నట్లు, ప్రపంచంలోనే అత్యధికంగా భారతదేశంలో రికవరీ ఉందని తెలిపింది. మొత్తంగా రికవరీ రేటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 90 శాతంగా ఉందంది.

గత 29 రోజుల నుంచి దేశంలో రికవరీ కేసులు (recovered cases) గణనీయంగా పెరుగుతున్నట్లు, మొత్తం 22 వేల 274 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా కోలుకున్న కేసులు పది రాష్ట్రాల్లో 73.56 శాతం, యుటీలో ఉన్నట్లు గుర్తించామని పేర్కొంది. కేరళ రాష్ట్రంలో అత్యధికంగా 4 వేల 506 రికవరీలు నమోదైనట్లు, తర్వాత వెస్ట్ బెంగాల్ లో 1,954 (West Bengal), మహరాష్ట్రలో 1,427 (Maharastra) గా ఉన్నాయని వెల్లడించింది. అయితే..కేరళ (Kerala) రాష్ట్రంలో అత్యధికంగా 5,397, మహరాష్ట్రలో 3, 431, పశ్చిమ బెంగాల్‌లో 1,541 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది