ఇండియాలోనే యంగెస్ట్ బస్ డ్రైవర్, 22 ఏళ్లకే డ్రైవర్ అయిన అమ్మాయి

ఇండియాలోనే యంగెస్ట్ బస్ డ్రైవర్, 22 ఏళ్లకే డ్రైవర్ అయిన అమ్మాయి

India’s youngest woman bus driver is just 22 years : కోల్ కతా అంటే జనారణ్యం. నగరంలోని రోడ్లన్నీ ఎప్పుడూ జనాల రద్దీతో బిజీ బిజీగా ఉంటాయి. ఈ బిజీ రోడ్లపై 22 ఏళ్ల అమ్మాయి నడిపే బస్సు రయ్ మంటూ దూసుకుపోతుంటుంది. ఆ అమ్మాయి పేరు కల్పనా మొండల్. ఆమే చేతిలో అంత పెద్ద బస్సు స్టీరింగ్ విష్ణుచక్రంలా గిర్రుమంటూ తిరుగుతుంది. గేర్ మార్చిందంటేచాలు రోడ్డు ఎంత రద్దీగా ఉన్నా..బస్సు రాకెట్ లా దూసుకుపోవాల్సిందే. భారతదేశంలోనే మొట్టమొదటి అతి చిన్న వయస్సు బస్సు డ్రైవర్ అయిన రికార్డు ఈ 22 ఏళ్ల కల్పా మొండల్ దే కావటం విశేషం. మరో విశేషం ఏమిటంటే కల్పన తన 8 ఏళ్ల వయస్సులోనే భారీ వాహనాలను నడిపేది.

కల్పన మొండల్ తండ్రి 2 సంవత్సరాల క్రితం ప్రమాదంలో చిక్కుకోవడం అతని రెండు కాళ్లకు రాడ్స్ వేసి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. దీంతో అతను అప్పటినుంచి వాహనాలను నడపలేని పరిస్థితి. దీంతో కుటుంబం కష్టాల్లో పడింది. కానీ తనకు ఇద్దరు అన్నలు ఉన్నాగానీ.. ఈ కష్టంలో నేనున్నానంటూ కుటుంబ బాధ్యతను తీసుకుంది అతి చిన్నవయస్సులోనే కల్పాన మొండల్. కల్పన మొండల్ కష్టంతో వచ్చిన ఆదాయమే వారి కుటుంబ నడుస్తోంది.

తండ్రికి ప్రమాదం జరిగినప్పుడు తానే ఆ బాధ్యత తీసుకోవాలని నిర్ణయించుకుంది. డ్రైవర్ గా చేరాలని అనుకుంది. కానీ బస్సు ఓనర్లు ఈమెను నమ్మలేకపోయినా ఓ బస్సు ఓనర్ మాత్రం కల్పన మొండల్ కి అవకాశం ఇచ్చాడు. కల్పన మొండల్ అతన్ని నమ్మకాన్ని ఏ మాత్రం ఒమ్ము చేయలేదు. రద్దీగా ఉండే కలకత్తా రోడ్లపై చక్కగా బస్సు నడిపించి తనకు అవకాశం ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకుంది.

కల్పన మొండల్ చేస్తున్న ఈ గొప్ప పనికి సంతోషిస్తూ తన తండ్రి సుభాష్ మండల్ మాట్లాడుతూ..కల్పన ఇప్పుడు ప్రతిరోజూ బస్సును నడిపి కుటుంబ భారాన్ని మోస్తోంది. ఇది నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. ఆమె భవిష్యత్ నే మా కుటుంబంకోసం ధారబోస్తోందని భావోద్వేగంగా చెప్పాడు సుభాష్ మొండల్.

భారతదేశంలో వాహనాలు నడపడానికి చాలా కష్టమైన నగరాలలో కలకత్తా ఒకటి. కల్పన మొండల్ అటువంటి నగరం యొక్క ఇరుకైన రోడ్లపై పెద్ద బస్సును అవలీలగా నడిపుతూ తన కుటుంబానికి పెద్ద దిక్కుగా మారింది. అంత చిన్న అమ్మాయి చాకచర్యంగా బస్సు నడిపే విధానం చూసినవాంతా ఆశ్చర్యపోతుంటారు.

India’s youngest woman bus driver is just 22 years

ఇలాంటి రోడ్లపై బస్సు నడుపుతున్నప్పుడు మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? కల్పన మొండల్ ని అడిగితే ఏం చెబుతుందో తెలుసా? విశాలంగా రోడ్లపై నడపటం కంటే కలకత్తాలాంటి ఇరుకైనా బిజీ రోడ్లపై బస్సుని నడపటమే కదా అసలైన ఛాలెంజ్ కానీ నేను నా బస్సుని చక్కగా నడగలను.. నన్ను చూసిన పోలీసులు చాలా ప్రోత్సహిస్తుంటారని చెప్పింది.

బస్ డ్రైవర్ గా పనిచేస్తునే కల్పన చదువు మాత్రం మానలేదు. రోజంతా కష్టపడటంతో ఇంటికెళ్లాక చదువుకోవాలంటే అలసటతో చదువుకోవటానికి ఓపిక ఉండదు.కానీ భవిష్యత్తులో చదువుకు చాలా ముఖ్యం కాబట్టి చదువుని మాత్రం నిర్లక్ష్యం చేయదు కల్పన. ఎందుకంటే పోలీసు డిపార్ట్ మెంట్ లో డ్రైవర్ గా పనిచేయాలని కల్పన అనుకుంటోంది. దీనికి అప్లై చేసుకోవాలంటే కనీస అర్హత సాధించాలని ఆమె లక్ష్యం.

ఓ పక్క చదువు.మరోపక్క పనిలో తల్లికి సహాయం..అలాగే డ్రైవర్ గా పని ఇలా అన్నింటిని బ్యాలెన్స్ చేస్తోంది కల్పన ఇంత చిన్న వయస్సులోను. ఈ పనుల్నీ సజావుగా జరగాలంటే ప్రతీరోజు ఉదయం 7 గంటలకు తన రోజు దినచర్య ప్రారంభిస్తుంది.

అలా గత సంవత్సరం నుంచి ఎస్ప్లానేడ్-బారానగర్ మార్గంలో బస్సు నడుపుతోంది ఈ 22ఏళ్ల అమ్మాయి.డ్రైవింగ్ అనేది ఇప్పటి వరకూ కూడా దాదాపు పురుషుల ఆధిపత్యంలోనే ఉంది. ఇలాంటి రంగంలో అతి చిన్న వయస్కురాలైన కల్పన మొండల్ మెరిసిపోతూ అందరిచేతా శెభాష్ అనిపించుకుంటోంది కల్పన మొండల్.