కరోనా కాటేస్తున్న ఈ సమయంలో జిమ్‌కు వెళ్లడం సురక్షితమేనా? ఈ జాగ్రత్తలు పాటిస్తే కొంతవరకు సేఫ్

  • Published By: naveen ,Published On : July 22, 2020 / 01:01 PM IST
కరోనా కాటేస్తున్న ఈ సమయంలో జిమ్‌కు వెళ్లడం సురక్షితమేనా? ఈ జాగ్రత్తలు పాటిస్తే కొంతవరకు సేఫ్

శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకునేందుకు, దేహదారుడ్యాన్ని పెంచుకోవడానికి జిమ్‌ సెంటర్‌కి వెళతారని తెలిసిందే. చాలామందికి జిమ్ కి వెళ్లి కసరత్తులు చేయడం అలవాటు. ఒక్కరోజు కూడా జిమ్ కి వెళ్లకుండా ఉండలేని వారు చాలామంది ఉన్నారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పరిస్థితులు మారిపోయాయి. జీవితం తలకిందలైంది. జిమ్ లు మూతబడ్డాయి. కరోనా కట్టడి కోసం అమల్లోకి తెచ్చిన లాక్ డౌన్ కారణంగా ఈ ఏడాది మార్చి నుంచి జిమ్ లు క్లోజ్ అయ్యాయి. అన్ లాక్ 1,2 లో భాగంగా పలు ఫ్యాక్టరీలకు, వ్యాపార, వాణిజ్య సముదాయాలకు, హోటల్స్ కు తెరుచుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చినా జిమ్ లు, సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్ కు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. కరోనా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉండటంతో వాటికి అనుమతి ఇవ్వలేదు ప్రభుత్వం.

ఈ సంక్షోభ కాలంలో జిమ్‌లకు వెళ్లడం సురక్షితమేనా?
కాగా, కరోనా కాటేస్తున్న ఈ సమయంలో జిమ్ లకు వెళ్లడం సురక్షితమా? కాదా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. దీనికి నిపుణులు సమాధానం ఇచ్చారు. మనం నివసించే ప్రదేశం, మనం వెళ్లే జిమ్ లో తీసుకునే ముందు జాగ్రత్తలు, మనం వ్యక్తిగతంగా పాటించే జాగ్రత్తల మీద ఆ అంశం ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

covid-effect

జిమ్ కి వెళ్లొచ్చా? లేదా?
మనం నివసించే ప్రాంతంలో కరోనా కేసులు ఎక్కువగా ఉంటే, జిమ్ కి దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు తేల్చి చెప్పారు. ఒకవేళ మనం నివసిస్తున్న ప్రాంతంలో కరోనా వ్యాప్తిని బాగా కట్టడి చేసి ఉంటే, కరోనా కేసులు తక్కువ సంఖ్యలో ఉంటే, అటువంటి పరిస్థితుల్లో జిమ్ కు వెళ్లి కసరత్తులు చేసుకోవడానికి కొంతమేరకు అవకాశాలు ఉన్నాయన్నారు. ఆ సమయంలోనూ కరోనా రిస్క్ లేకపోలేదన్నారు.

కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి:
జిమ్ సెంటర్ నిర్వహాకులు, జిమ్ కి వెళ్లాలని అనుకునే వారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కొంతవరకు సేఫ్ అని నిపుణులు చెప్పారు. జిమ్ సెంటర్ లో కరోనా వ్యాప్తి చెందకుండా నిర్వాహాకులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అప్పుడే, కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి అవకాశం ఉంటుందని ఎమోరి యూనివర్సిటీ ఇన్ ఫెక్షియస్ డిసీజస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మారిబెత్ అన్నారు.

కరోనా కాటేయకుండా జిమ్ సెంటర్‌లో పాటించాల్సిన జాగ్రత్తలు:
* జిమ్ సెంటర్ లో ఒక్కో వ్యక్తి మధ్య 6 ఫీట్ల దూరం ఉండేలా చూడాలి
* తక్కువ సంఖ్యలో జిమ్ లోకి వ్యక్తులను అనుమతించాలి
* లాకర్ రూమ్ ఇవ్వకూడదు
* ఎవరికి వారు సొంతంగా వాటర్ బాటల్ తెచ్చుకోవాలి
* ప్రతి ఒక్కరూ శానిటైజర్ రాసుకోవాలి
* జిమ్ సెంటర్ లోని ఎక్సర్ సైజ్ మెషిన్లను రెగులర్ గా వైరస్ లను చంపే పదార్దాలతో శుభ్రం చేయాలి
* జిమ్ లోకి వచ్చే వ్యక్తులు ఫేస్ కవర్లు వాడాలి
* జిమ్ కి వచ్చే వారు బ్యాకప్(ఎక్స్ ట్రా) మాస్కు ఉంచుకోవాలి
* చెమట కారణంగా మనం వేసుకున్న మాస్క్ తడిచిపోతే సమస్యగా మారుతుంది, అందుకే ఎక్స్ ట్రా మాస్కు ఉంచుకోవాలి

open gyms to come up in hyderabad parks

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, అప్రమత్తంగా ఉన్నా జిమ్ లో కచ్చితంగా రిస్క్ ఉంటుందని నిపుణులు స్పష్టం చేశారు. దీనికి కారణం జిమ్ సెంటర్లు ఇండోర్ లో ఉండటమే. వెంటిలేషన్(గాలి, వెలుతురు) చాలా తక్కువగా ఉంటుంది. జిమ్ సెంటర్లు అసలే ఇరుకు ఇరుకుగా ఉంటాయి. దీంతో భౌతిక దూరం పాటించడం చాలా కష్టం. చెమట పట్టకుండా జిమ్ లో ఎక్సర్ సైజులు చేసుకోగలిగితే కొంతవరకు మేలు అన్నారు. అన్నింటికి కన్నా ఉత్తమం, క్షేమకరం, సురక్షితం ఏంటంటే.. మన ఇంట్లోనే ఆరుబయట లేదా ఓపెన్ ప్లేస్ లో ఎక్సర్ సైజులు చేసుకోవడం బెస్ట్ అని నిపుణులు అంతిమంగా తేల్చారు.