జమ్మూలో ఇంటర్నెట్ సేవల నిలుపుదలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

  • Published By: madhu ,Published On : January 10, 2020 / 08:27 AM IST
జమ్మూలో ఇంటర్నెట్ సేవల నిలుపుదలపై సుప్రీం కీలక వ్యాఖ్యలు

జమ్మూ కాశ్మీర్‌లో కొద్ది రోజులుగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లపై 2020, జనవరి 10వ తేదీ శుక్రవారం సమీక్షించింది. ఇంటర్నెట్‌పై అపరిమిత ఆంక్షలు సరికాదని, దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. కానీ..సేవలను పర్మినెంట్‌గా నిలిపివేయడం మాత్రం అనుమతించమని వెల్లడించింది. వారంలో సమీక్షించాలని సూచించింది. 

నెట్ కలిగి ఉండడం భావ ప్రకటన స్వేచ్చలో అంతర్బాగం అని వెల్లడించింది. రాజ్యాంగంలోని 19కి తూట్లు పొడుస్తారా అని ప్రశ్నించింది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లేలా అధికారం చెలాయించరాదని సూచించింది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం టెలికాం నిబంధనలకు విరుద్ధమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఎలాంటి గడువు లేకుండా నిరవధికంగా సేవలను ఎలా నిలిపివేస్తారని ప్రశ్నించింది. 
 

జమ్మూ కాశ్మీర్‌లో 370ని రద్దు చేసిన తర్వాత…ఇంటర్నెట్ వినియోగంపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తన్నట్లు కేంద్రం వెల్లడించింది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు సుప్రీం తలుపులు తట్టారు. పిటిషన్‌ను జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పై విధంగా ఆదేశాలు జారీ చేసింది. 

Read More :