జార్ఖండ్ ప్రజలకు రాహుల్ హామీ…గెలిపిస్తే 2లక్షల రుణమాఫీ

  • Published By: venkaiahnaidu ,Published On : December 12, 2019 / 10:25 AM IST
జార్ఖండ్ ప్రజలకు రాహుల్ హామీ…గెలిపిస్తే 2లక్షల రుణమాఫీ

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమ కూటమిని గెలిపిస్తే 2లక్షల వ్యవసాయ రుణమాఫీ చేయనున్నట్లు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎమ్ఎమ్,కాంగ్రెస్,ఆర్జేడీ పార్టీలు కూటమిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇవాళ (డిసెంబర్-12,2019) జేఎమ్ఎమ్ పార్టీ అభ్యర్థి కేతుబుద్దీన్ షేక్ కు మద్దతుగా జార్ఖండ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్… తమ కూటమి అధికారంలోకి వస్తే రైతులు క్వింటా వరికి రూ.2,500కనీస మద్దతు ధర అందుకుంటారని అన్నారు. అధికరంలోకి వస్తే తమ మొదటి లక్ష్యం 2లక్షలలోపు వ్యవసాయ రుణాల మాఫీ అని రాహుల్ తెలిపారు.

చత్తీస్ ఘడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులకు క్వింటా వరికి రూ.2,500 కనీస మద్దతు ధర ఇస్తున్నట్లు తెలిపారు. తమను గెలిపిస్తే జార్ఖండ్ రైతులు కూడా అదే కనీస మద్దతు ధర అందుకుంటారని రాహుల్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మోడీ సర్కార్ పై రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

కేంద్రంలోని మోడీ సర్కార్ కారణంగా దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. నిరుద్యోగ రేటు 45ఏళ్ల గరిష్ఠానికి చేరుకుందన్నారు. మోడీ సర్కార్ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కారణంగా సామ్యానులు తీవ్ర ఇబ్బ్దందులు ఎదుర్కొన్నారన్నారు. నోట్ల రద్దు ప్రభావం ఇప్పటికి ఉందని రాహుల్ అన్నారు.