ధూమపానం చేయని వారికే ఉద్యోగాలు : ప్రభుత్వం ప్రకటన

  • Published By: nagamani ,Published On : December 4, 2020 / 05:18 PM IST
ధూమపానం చేయని వారికే ఉద్యోగాలు : ప్రభుత్వం ప్రకటన

Jharkhand :  Indian state mandates jobs for ‘non-smokers’ only : జార్ఖండ్ ప్రభుత్వం మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. అదేమంటే..ధూమపానం చేయని వారికే ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఉద్యోగం కావలని ఆశపడేవారు ధూమపానం చేయనివారై ఉండాలి. పైగా ధూమపానం చేయం అని నిరూపించుకోవాలి.దానికి సంబంధించి అఫిడవిట్లు కూడా ప్రభుత్వానికి సమర్పించాలని స్పష్టం చేసింది జార్ఖండ్ ప్రభుత్వం.



యువనేత..జార్ఖండ్ సీఎం అయిన హేమంత్ సోరెన్ ప్రభుత్వం ఈ వినూత్న ప్రకటన చేసింది. జార్ఖండ్ ప్రభుత్వం తన కార్యాలయాలను పొగాకు రహిత మండలాలుగా ప్రకటించింది. తాము ధూమపానం చేయమని, పొగాకు నమలమని పేర్కొంటు ఉద్యోగులు అఫిడవిట్లను దాఖలు చేయడం తప్పనిసరి చేంది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది.


దీంట్లో భాగంగానే కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకోబోయేవారిని కూడా ధూమపానం చేయనివారినే తీసుకోవాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగంలో చేరబోయేవారు కూడా తాము ధూమపానం చేయమని..పొగాకు తినబోమని అఫిడవిట్లు సమర్పించాల్సి ఉంటుంది.


2021 ఏప్రిల్ నుంచి ఈ నిబంధనను జార్ఖండ్ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చింది. పొగాకు ఉత్పత్తులైన సిగరెట్లు, బీడీ, ఖైనీ, గుట్కా, పాన్ మసాలా, జరదా, సుపారి, హుక్కా, ఈ సిగరెట్, పొగాకు ఉత్పత్తులను ఉపయోగించరాదని రాష్ట్ర ఆరోగ్య విద్య, కుటుంబసంక్షేమశాఖ ప్రకటనలో కోరింది.


ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు రంగ కార్యాలయాలు, ప్రధాన ద్వారాల వద్ద పొగాకు రహిత జోన్ అంటూ బోర్డులను ఉంచాలని జార్ఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సింగ్ అధికారులను ఆదేశించారు.